CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్‌తో నాకున్న విభేదాలు ఇవే: సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Jan 06 , 2024 | 09:47 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో తనకు సంబంధాలపై తెలంగాణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏబీఎన్ బిగ్ డిబేట్‌లో పాల్గొన్న ఆయన.. జగన్‌తో తనకు రాజకీయంగా ఏమాత్రం సఖ్యత లేదన్నారు.
CM Revanth Reddy First Interview With ABN MD RK: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో తనకు సంబంధాలపై తెలంగాణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏబీఎన్ బిగ్ డిబేట్‌లో పాల్గొన్న ఆయన.. జగన్‌తో తనకు రాజకీయంగా ఏమాత్రం సఖ్యత లేదన్నారు. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు రాజకీయంగా తన బాధ్యతలు తాను నిర్వహించానన్నారు. నాటి సీఎం రాజశేఖర్ రెడ్డినే ఢీకొన్నానని అన్నారు. చంద్రశేఖర్ రావు ఔట్ అండ్ ఔట్ ఏపీ సీఎం జగన్‌తో కలిసి ఉంటున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓటమి తరువాత మరింత అతుక్కున్నట్లుగా ఉంటున్నారని అన్నారు. ఇటీవల వీరిద్దరూ మీట్ అవడాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు.
రాజకీయంగా జగన్‌తో ఏమాత్రం సఖ్యత లేదన్న సీఎం రేవంత్ రెడ్డి.. 'నేను రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకుంటున్నాను.. జగన్ మాత్రం మోదీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. నేను ఇక్కడ కేసీఆర్‌ను ఓడించాలని కోరుకున్నాను.. కానీ, ఇక్కడ కేసీఆర్ ఉండాలని జగన్ కోరుకుంటున్నారు. మా ఇద్దరి లక్ష్యాలు విరుద్ధమైనవి. అయితే, జగన్ నాకు ప్రత్యర్థి అని నేను అనుకోవడం లేదు. ఆ అవసరం కూడా నాకు లేదు.' అని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి.