CM Revanth Reddy: నేడు ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి..
ABN , Publish Date - Mar 07 , 2024 | 08:12 AM
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. సాయంత్రం ఏఐసీసీ కార్యాలయంలో జరగనున్న కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఏం భట్టి విక్రమార్క కూడా వెళ్లనున్నారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గురువారం మధ్యాహ్నం ఢిల్లీ (Delhi) పర్యటనకు వెళ్లనున్నారు. సాయంత్రం ఏఐసీసీ (AICC) కార్యాలయం (Office)లో జరగనున్న కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశానికి (Congress Central Election Committee meeting) ఆయన హాజరుకానున్నారు. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కూడా వెళ్లనున్నారు. అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttem Kumar Reddy) సీఇసీ (CEC) సభ్యుడి హోదాలో సమావేశంలో పాల్గొననున్నారు.
కాగా గురువారం కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను ఏఐసీసీ విడుదల చేయనుంది. 150 నుంచి 200 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల కానుంది. తెలంగాణ నుంచి 10 మంది అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించనుంది. తెలంగాణ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డికి అప్పజెప్పింది. గెలుపు గుర్రాలకే సీట్లు ఇస్తామని హస్తం నేతలు స్పష్టం చేశారు. తొలి జాబితాలో సీటు దక్కించుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు.