Traffic Police : ట్రా‘ఫికర్’ను తీర్చే డ్రోన్లు వచ్చేశాయ్!
ABN , Publish Date - Jun 15 , 2024 | 04:28 AM
హైదరాబాద్ రోడ్ల మీద ట్రాఫిక్ నిర్వహణను ఇక ’గగన నేత్రం’ ద్వారానూ పర్యవేక్షనున్నారు. ట్రాఫిక్ నిర్వహణ, నియంత్రణ కోసం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రోన్‌లను ఉపయోగించనున్నారు. ఈ మేరకు సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సౌజన్యంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ‘థర్ ఐ ట్రాఫిక్ మానిటరింగ్ డ్రోన్’ను అభివృద్ధి చేశారు.
సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నిర్వహణ,
నియంత్రణ కోసం డ్రోన్లు
పనితీరును పరిశీలించిన సైబరాబాద్ పోలీసులు
సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నిర్వహణ,
హైదరాబాద్ సిటీ, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ రోడ్ల మీద ట్రాఫిక్ నిర్వహణను ఇక ’గగన నేత్రం’ ద్వారానూ పర్యవేక్షనున్నారు. ట్రాఫిక్ నిర్వహణ, నియంత్రణ కోసం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రోన్‌లను ఉపయోగించనున్నారు. ఈ మేరకు సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సౌజన్యంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ‘థర్ ఐ ట్రాఫిక్ మానిటరింగ్ డ్రోన్’ను అభివృద్ధి చేశారు. శుక్రవారం డ్రోన్ పనితీరును సీపీ అవినాశ్ మహంతి ప్రయోగాత్మకంగా పరిశీలించారు.
ఈ డ్రోన్ల ద్వారా ట్రాఫిక్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ట్రాఫిక్‌కు సంబంధించిన సమస్యలనూ గుర్తించవచ్చు. ఫలితంగా ట్రాఫిక్ సమస్యలు నెలకొన్న చోటును గుర్తించి వేగంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. సైబరాబాద్ పరిధిలోని వాహనదారులకు, ప్రత్యేకించి ఐటీ కారిడార్‌లోని వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ట్రాఫిక్ నిర్వహణ సులభతరం అవుతుందని, రోడ్లపై వాహనాల వేగం కూడా పెరుగుతుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే గుజారాత్‌లోని అహ్మదాబాద్‌లో ట్రాఫిక్ నిర్వహణ, నియంత్రణలో డ్రోన్లను విజయవంతంగా ఉపయోగిస్తున్నారు.