Share News

Hyderabad: బిగ్ అలర్ట్.. ఆ ప్రాంతాల్లో విద్యుత్ కట్.. కారణమిదే..

ABN , Publish Date - May 18 , 2024 | 01:57 PM

వర్షాకాలం ప్రారంభానికి ముందే విద్యుత్‌ లైన్ల మరమ్మతులను పూర్తిచేసే దిశగా విద్యుత్‌శాఖ(Electricity Department) చర్యలు చేపట్టింది. ఒక్కో ఫీడర్‌ పరిధిలో అరగంట విద్యుత్‌(Power Supply Off) బంద్‌ చేసి పనులు చేపట్టనుంది. ఈమేరకు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మరమ్మతులు చేసుకునేందుకు వీలుగా ఎల్‌సీ(లైన్‌ క్లియరెన్స్‌) ఇచ్చేందుకు విద్యుత్‌శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Hyderabad: బిగ్ అలర్ట్.. ఆ ప్రాంతాల్లో విద్యుత్ కట్.. కారణమిదే..
Electricity Department

హైదరాబాద్‌, మే 18: వర్షాకాలం ప్రారంభానికి ముందే విద్యుత్‌ లైన్ల మరమ్మతులను పూర్తిచేసే దిశగా విద్యుత్‌శాఖ(Electricity Department) చర్యలు చేపట్టింది. ఒక్కో ఫీడర్‌ పరిధిలో అరగంట విద్యుత్‌(Power Supply Off) బంద్‌ చేసి పనులు చేపట్టనుంది. ఈమేరకు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మరమ్మతులు చేసుకునేందుకు వీలుగా ఎల్‌సీ(లైన్‌ క్లియరెన్స్‌) ఇచ్చేందుకు విద్యుత్‌శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో శనివారం గ్రేటర్‌జోన్‌ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో కరెంట్‌ కోతలు ఉండనున్నాయి. ఎల్‌సీ తీసుకున్న సమయంలోనే ఆయా ఫీడర్‌ పరిధిలో సిబ్బంది మరమ్మతులు పూర్తి చేయాల్సి ఉంటుంది. విద్యుత్‌తీగలకు తగిలే చెట్ల కొమ్మలను తొలగించే చర్యలు చేపట్టాలని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌ ఫరూకీ అధికారులను ఆదేశించారు.


71 ఎంయూలకు పడిపోయిన డిమాండ్‌..

వర్షాలతో ఎండల తీవ్రత కాస్త తగ్గింది. శుక్రవారం గ్రేటర్‌లో పగటి ఉష్ణోగ్రతలు 36 నుంచి 32 డిగ్రీల వరకు నమోదయ్యాయి. మే 4న అత్యధికంగా 90.68 మిలియన్‌ యూనిట్ల(ఎం.యూ) విద్యుత్‌డిమాండ్‌ నమోదుకాగా, శుక్రవారం 71 మిలియన్‌ యూనిట్లకు పడిపోయింది. రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

For More Telangana News and Telugu News..

Updated Date - May 18 , 2024 | 02:05 PM