Share News

Fire Accident: జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఇంకా ఆదుపులోకి రాని మంటలు..

ABN , Publish Date - Nov 27 , 2024 | 08:13 AM

హైదరాబాద్ నగరలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాలిథిన్ సంచులు తయారయ్యే ఎస్ఎస్‌వి ఫ్యాబ్ పరిశ్రమలో మంగళవారం మధ్యాహ్నం మంటలు మొదలయ్యాయి. రాత్రి దాదాపు 1గంట ప్రాంతంలో మూడంతస్తుల భవనం 75 శాతం కూలింది. కింది అంతస్తులో భారీ మొత్తంలో ప్లాస్టిక్‌కు సంబంధించిన ముడి సరుకు ఉంది. ఇంకా మంటలు అదుపులోకి రాలేదు.

Fire Accident: జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఇంకా ఆదుపులోకి రాని మంటలు..

హైదరాబాద్‌: నగరంలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఓ పరిశ్రమలో (Jeedimetla industrial Area) మంగళవారం భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించింది. దీంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. పాలిథిన్ సంచులు తయారయ్యే ఎస్ఎస్‌వి (SSV) ఫ్యాబ్ పరిశ్రమలో మంగళవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. రాత్రి దాదాపు 1గంట ప్రాంతంలో మూడంతస్తుల భవనం 75 శాతం కూలింది. కింది అంతస్తులో భారీ మొత్తంలో ప్లాస్టిక్‌కు సంబంధించిన ముడి సరుకు ఉంది. నిన్నటి నుండి మంటలను అదుపుచేసేందుకుఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం వరకు మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. నాలుగు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. భారీ మంటల దాటికి పూర్తిగా కాలీ.. మొత్తం నాలుగు అంతస్థుల భవనం కూలిపోయింది. ఇంకా పరిసర ప్రాంత వాసులు భయం గుప్పిట్లో ఉన్నారు.


కాగా నగరంలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్ బ్యాగుల పరిశ్రమలో మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సదరు పరిశ్రమ యాజమాన్యంతోపాటు స్థానికులు వెంటనే స్పందించి.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఆరు ఫైరింజన్లతోపాటు 20 వాటర్ ట్యాంకర్లతో అగ్నిమాపక సిబ్బంది.. ఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే పరిశ్రమలో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. దాదాపు నాలుగు గంటలుగా వాటిని అదుపులోకి తీసుకు వచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ సాధ్యం కావడం లేదు. ఆ క్రమంలో మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు వారు మరింత శ్రమిస్తున్నారు. మరోవైపు భారీగా మంటలు ఎగసిపడుతుండడంతో.. ముందస్తు చర్యల్లో భాగంగా పరిసర ప్రాంతంలోని ప్రజలను అగ్ని మాపక సిబ్బంది ఖాళీ చేయిస్తున్నారు.

మరోవైపు అగ్ని మాపక శాఖ నిర్లక్ష్య వైఖరిపై స్థానికులు మండిపడుతున్నారు. ఈ ప్రమాదంపై ఫిర్యాదు అందిన వెంటనే రెండు ఫైరింజన్లు మాత్రమే ఘటన స్థలానికి చేరుకున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో మంటలు రెండో అంతస్తుకు సైతం వ్యాపించాయని వారు వివరిస్తున్నారు. ఆ తర్వాత మరిన్ని ఫైరింజన్లు వచ్చినా.. మంటలను మాత్రం అదుపులోకి తీసుకు రాలేక పోయారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే.. మంటలు అదుపులోకి తీసుకు వచ్చేందుకు గంటలు గంటలుగా ప్రయత్నిస్తున్న.. అవి విఫలం కావడంతో అగ్నిమాపక సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. అదీకాక ఈ ఫ్యాక్టరీలో వేస్టేజ్ చాలా ఉందని.. అందువల్ల అగ్నికీలలు అదుపులోకి రావడం లేదనే వాదన స్థానికంగా వినిపిస్తోంది. అయితే జీహెచ్‌ఎంసీ, డీఆర్ఎఫ్, స్థానికులు సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మరికొన్ని గంటల్లో మంటలు అదుపులోకి తీసుకు వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

అయితే ఈ అగ్ని ప్రమాదంలో ఎవరైనా మరణించారా.. ఎవరికైనా గాయాలయ్యాయా.. అనే విషయం మాత్రం వెల్లడికాలేదు. ఈ ప్రమాదానికి గల కారణాలు కూడా తెలియ రాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా ఈ ప్రమాదం.. షార్ట్ సర్కూట్ కారణంగానా? లేకుంటే మానవ తప్పిదమా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎవరి బలమెంత?

పారదర్శకత లేని వైసీపీ పాలన

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 27 , 2024 | 08:13 AM