Nokia Team: సీఎం రేవంత్ రెడ్డితో జర్మనీ ప్రతినిధుల భేటీ
ABN , Publish Date - Jul 03 , 2024 | 11:36 AM
హైదరాబాద్: తెలంగాణకు పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. తాజాగా నోకియా కంపనీకి చెందిన జర్మనీ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.
హైదరాబాద్: తెలంగాణకు పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. తాజాగా నోకియా కంపనీ (Nokia Company)కి చెందిన జర్మనీ ప్రతినిధులు (Germany Representatives) సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. సచివాలయానికి వెళ్లిన నోకియా గ్లోబల్ హెడ్ మార్టీన్, సేల్స్ హెడ్ మ్యాన్క్, గ్లోబల్ డైరెక్టర్ వెంకట్‌తో పాటు ఎమ్మెల్యే మదన్ మోహన్ సీఎంను మర్యాదపూర్వకంగా కలిసారు. నోకియా కంపెనీకి సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరిపారు. కాగా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా తెలంగాణకు పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. కొత్త పాలసీలు తెచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు. ఐటీ రంగంలో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు.