Share News

TGSPSC Group 2 Hall Ticket: గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్..

ABN , Publish Date - Dec 09 , 2024 | 02:12 PM

డిసెంబర్ 15, 16 తేదీల్లో రోజుకు రెండేసి సెషన్ల చొప్పున పరీక్షలను నిర్వహించనుంది. ఈరోజు ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను విడుదల చేసింది.

TGSPSC Group 2 Hall Ticket: గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్..

హైదరాబాద్‌: గ్రూప్‌-2 హాల్ టికెట్లను టీజీపీఎస్సీ ఇవాళ(సోమవారం) విడుదల చేసింది. అభ్యర్థులు ఈరోజు నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో రోజుకు రెండేసి సెషన్ల చొప్పున పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షల నిర్వహణకు ఇప్పటికే షెడ్యూల్‌ ఖరారైన విషయం తెలిసిందే. పరీక్షలకు ఒకరోజు ముందు.. అంటే.. వచ్చేనెల 14వ తేదీ వరకు హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ ఆప్షన్‌ ఉంటుందని వివరించింది.


15వ తేదీ ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పేపర్‌-1(జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీస్‌), మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్‌-2(చరిత్ర, పాలిటీ, సొసైటీ), 16వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్‌-3(ఎకానమి అండ్‌ డెవల్‌పమెంట్‌), మధ్యాహ్నం 3 నుంచి 5.30 వరకు పేపర్‌-4(తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం) పరీక్షలు జరుగుతాయి. ఉదయం సెషన్‌లో 9.30 గంటలకు.. మధ్యాహ్నం సెషన్‌లో 2.30 గంటలకు గేట్లను మూసివేస్తారని.. ఆ తర్వాత వచ్చే అభ్యర్థులను పరీక్షలకు అనుమతించబోరని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. అన్ని పరీక్షలకు ఒకే హాల్‌టికెట్‌ను వినియోగించాలని తెలిపింది.

Updated Date - Dec 09 , 2024 | 02:14 PM