TG highcourt: కేటీఆర్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ...
ABN , Publish Date - Dec 20 , 2024 | 04:11 PM
Telangana: ఫార్ములా ఈరేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. కేటీఆర్ తరపున లాయర్ సుందరం వాదనలు వినిపించారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఏసీబీ కేసు నమోదు చేశారని న్యాయవాది సుందరం కోర్టుకు తెలిపారు.
హైదరాబాద్, డిసెంబర్ 20: తెలంగాణ హైకోర్టులో (Telangana Highcourt) మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) పిటిషన్‌పై విచారణ ప్రారంభమైంది. ఏసీబీ (ACB) కేసుపై కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేవారు. ఫార్ములా ఈ-కార్ రేస్‌లో కేటీఆర్‌పై ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసును కొట్టివేయాలని మాజీ మంత్రి పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టులో విచారణ మొదలవగా.. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు. అలాగే ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదించారు.
మరో గుడ్ న్యూస్‌కు రెడీ అంటున్న ఏపీ సర్కార్..
కేటీఆర్ లాయర్ వాదనలు ఇవే..
రాజకీయ కుట్రలో భాగంగానే ఏసీబీ కేసు నమోదు చేశారని కేటీఆర్ తరపు న్యాయవాది కోర్టు తెలిపారు. ఏసీబీ నమోదు చేసిన సెక్షన్లు కేటీఆర్‌కు వర్తించవని.. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనేందుకు ఆధారాలు లేవన్నారు. కేటీఆర్ లబ్ధిపొందినట్టు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనలేదన్నారు. ఫార్ములా ఈ-కార్ రేస్‌తో హైదరాబాద్‌కు ప్రయోజనం చేకూరిందని కోర్టుకు తెలిపారు. ప్రొసీజర్ పాటించలేదనడం సరికాదన్నారు. 14 నెలల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారని.. ప్రాథమిక విచారణ కూడా లేకుండా కేసు పెట్టారన్నారు. కేవలం రాజకీయ కుట్రలో భాగమే కేటీఆర్‌పై కేసు నమోదు చేశారని లాయర్ సుందరం వాదించారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘనతో ఏసీబీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగితే ఈసీ పరిశీలించాలన్నారు. రేస్ కోసం నిర్వాహకులు నిధులు చెల్లిస్తే కేటీఆర్‌పై కేసు ఎందుకు పెట్టారని అడిగారు. కేటీఆర్ ఎక్కడ లబ్ధి పొందారని లాయర్ ప్రశ్నించారు. ఈ కేసులో ఎన్నో తప్పులు కనిపిస్తున్నాయని.. కార్ రేస్ నిర్వహణకు 2022 అక్టోబర్ 25న ఒప్పందం జరిగిందని.. అయితే సీజన్ 10 నిర్వహణకు స్పాన్సర్లు వెనక్కి తగ్గారన్నారు. ఫార్ములా ఈ - రేస్ నుంచి స్పాన్సర్లు తప్పుకోవడం వల్ల.. హెచ్‌ఎమ్‌డీఏ ద్వారా ఎఫ్‌ఈవోకు చెల్లింపులు జరిగాయన్నారు. ఈవెంట్ నిర్వహించకుంటే హైదరాబాద్ ఇమేజ్..డ్యామేజ్ అవుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కార్ రేసింగ్ ఒప్పందాన్ని కొత్త ప్రభుత్వం ఉల్లంఘించిందని చెప్పారు.
కేటీఆర్‌పై కేసులో కీలక పరిణామం..
కొత్త ప్రభుత్వం డబ్బు చెల్లించకపోవడంతో ఒప్పందం రద్దయిందన్నారు. సుప్రీం తీర్పుల ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదులో ఆలస్యం తగదన్నారు. అఫెన్స్ జరిగిందని తెలిశాక 3 నెలల్లోపే కేసు రిజిస్టర్ చేయాలన్నారు. 11 నెలల తర్వాత కేసు నమోదు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎఫ్‌ఐఆర్ నమోదులో ఆలస్యానికి కారణాలు చెప్పలేదన్నారు. ఎఫ్‌ఐఆర్‌కు ముందు ప్రాథమిక విచారణ అవసరమన్నారు. ప్రాథమిక విచారణ అవసరమని సుప్రీం తీర్పులున్నాయని తెలిపారు. సుప్రీం తీర్పులను ఏసీబీ అధికారులు పట్టించుకోలేదని అన్నారు. 18న ఫిర్యాదు అందగానే.. 19న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని.. అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పలేదని కేటీఆర్ తరపున లాయర్ సుందరం కోర్టులో వాదనలు వినిపించారు.
ఇవి కూడా చదవండి...
Lagacharla Case: ప్రభుత్వానికి వ్యతిరేకంగా లగచర్ల రైతుల నినాదాలు..
కేటీఆర్ ఎపిసోడ్: రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ
Read Latest Telangana News And Telugu News