Allu Arjun: అల్లు అర్జున్ రిలీజ్.. హైకోర్టు సంచలన తీర్పు..
ABN , Publish Date - Dec 13 , 2024 | 05:41 PM
క్వాష్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేస్తూ తక్షమే బెయిల్ మంజూరు చేసింది. న్యాయమూర్తి ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని అల్లు అర్జున్ తరపున న్యాయవాది కోరగా.. కేసుపై సోమవారం విచారణ జరపాలని, అత్యవసర విచారణ అవసరం లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు.
సంథ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో అరెస్టైన నటుడు అల్లు అర్జున్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా మేజిస్ట్రేట్ 14రోజుల రిమాండ్ విధించారు. దీంతో కేసును కొట్టేయాలంటూ అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం అల్లు అర్జున్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. క్వాష్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేస్తూ తక్షమే బెయిల్ మంజూరు చేసింది. న్యాయమూర్తి ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని అల్లు అర్జున్ తరపున న్యాయవాది కోరగా.. కేసుపై సోమవారం విచారణ జరపాలని, అత్యవసర విచారణ అవసరం లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. క్వాష్ పిటిషన్‌పై విచారణను వాయిదావేస్తే తక్షణమే బెయిల్ మంజూరుచేసేలా ఆదేశాలు ఇవ్వాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాది కోరగా.. ప్రభుత్వ తరపు న్యాయవాది బెయిల్ ఇవ్వొద్దని వాదించారు. బెయిల్, క్వాష్ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకోవద్దని ప్రభుత్వ లాయర్ కోరారు. తన క్లైంట్‌పై పెట్టిన కేసు కొట్టేయాలని 118 (1) బీఎన్‌ఎస్ అల్లు అర్జున్‌కు వర్తించదని ఆయన తరపు లాయర్ నిరంజన్ రెడ్డి వాదించారు. అల్లు అర్జున్‌కు బెయిల్ ఇస్తే మీ అభ్యంతరం ఏమిటని ప్రభుత్వ న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగా ఈఘటనకు పాల్పడలేదని, తన క్లైంట్‌కు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని నిరంజన్ రెడ్డి వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించారు.
వాదనలు ఇలా..
క్వాష్ పిటిషన్‌పై విచారణ జరపలేమని న్యాయస్థానం చెప్పడంతో వెంటనే మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాది కోరారు. ప్రభుత్వ తరపు న్యాయవాది బెయిల్ ఇవ్వొద్దని వాదించారు. అయినప్పటికీీీీ కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయస్థానం అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం వెలువరించింది.
ప్రత్యేకంగా..
నిందితుడికి బెయిల్ కోసం ట్రయల్ కోర్టులో పిటిషన్ వేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైన కేసుల్లో పై న్యాయస్థానాలు కలుగజేసుకుని మధ్యంతర బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్‌ను ట్రయల్ కోర్టులో వెయ్యకుండా కేసు కొట్టేయాలని క్వాష్ పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్‌పై తక్షణ విచారణకు కోర్టు అంగీకరించకపోవడంతో బెయిల్ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకోవాలని లాయర్ కోరడంతో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది. దీంతో జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల కానున్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here