Digital Card: డిజిటల్ కార్డుల కోసం ఇంటింటి సర్వే.. ఎప్పటినుంచి అంటే
ABN , Publish Date - Oct 02 , 2024 | 10:34 AM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం డిజిటల్ కార్డుల సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఇంటింటికీ వెళ్లి కుటుంబాల హెల్త్ ప్రొఫైల్ రికార్డు చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నెల 7న పైలట్ ప్రాజెక్ట్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రికార్డు ప్రక్రియ పూర్తి కానుంది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం (Telangana State)లో గురువారం నుంచి డిజిటల్ కార్డుల (Digital Card) కోసం ఇంటింటి సర్వే (Survey) నిర్వహించనున్నారు. 119 నియోజక వర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ (Pilot Project) కింద డిజిటల్ కార్డులు జారీ చేయనున్నారు. ప్రతీ నియోజక వర్గంలో ఒక గ్రామం, ఒక పట్టణ డివిజన్‌ను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేస్తారు. పైలట్ ప్రాజెక్టు కింద మొత్తం 238 గ్రామాలు, డివిజన్లను అధికారులు ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గురువారం డిజిటల్ కార్డుల సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఇంటింటికీ వెళ్లి కుటుంబాల హెల్త్ ప్రొఫైల్ రికార్డు చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నెల 7న పైలట్ ప్రాజెక్ట్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రికార్డు ప్రక్రియ పూర్తి కానుంది. పర్యవేక్షణ కోసం స్పెషల్ ఆఫీసర్లను ప్రభుత్వం నియమించింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా సేకరించిన వివరాల ఆధారంగా డిజిటల్ కార్డులు జారీ చేస్తారు.
ప్రతి కుటుంబానికి డిజిటల్ హెల్త్ కార్డులు
కాగా రాష్ట్రంలో పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి కుటుంబానికి హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ప్రొఫైల్ రూపొందించి, విశిష్ట సంఖ్య (యూనిక్ నంబర్)తో స్మార్ట్ కార్డు ఇవ్వడమే ఫ్యామిలీ కార్డు ప్రధాన ఉద్దేశమని తెలిపారు. సామాన్య ప్రజలకు సాధ్యమైనంత మేలు చేయాలన్న సంకల్పంతోనే ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డును తీసుకొస్తోందని వెల్లడించారు. అత్యంత ప్రాధాన్యం ఉన్న ఈ కార్డుల జారీలో పొరపాట్లకు తావులేకుండా, కుటుంబ సభ్యుల వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. సచివాలయం నుంచి మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకి సంబంధించి 119 నియోజకవర్గాల్లోని 238 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నామని వివరించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక పట్టణ, ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఎంచుకోవాలని సూచించారు. 3 నుంచి 7వ తేదీ వరకు ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి వివరాలను సేకరించాలన్నారు. ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రతి నియోజకవర్గానికి ఆర్డీవో స్థాయి, జోనల్ కమిషనర్ స్థాయి వారిని ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 3నపైలట్ ప్రాజెక్టును సీఎం ప్రారంభిస్తారన్నారు. దాని ఫలితాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు.
ఎల్‌ఆర్‌ఎస్ ముందుకు సాగడం లేదు..
నాలుగేళ్ల నుంచి లక్షలాది మంది ఎల్‌ఆర్‌ఎస్ కోసం ఎదురు చూస్తున్నారని, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా యుద్ధప్రాతిపదికన దరఖాస్తులను పరిష్కరించాలని మంత్రి పొంగులేటి కలెక్టర్లను ఆదేశించారు. ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదన్నారు. కొన్ని జిల్లాల్లో వేల సంఖ్యలో దరఖాస్తులు ఉంటే పదుల సంఖ్యలో కూడా పరిష్కరించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే పట్టణ అభివృద్ధి సంస్థ (యూడీఏ)ల పరిధి పెంపు, కొత్త యూడీఏల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను తక్షణమే ప్రభుత్వానికి పంపించాలని ఆదేశించారు. గత ప్రభుత్వం అరకొరగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించిందని, ఇందులో కొన్ని మాత్రమే పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. పూర్తయిన ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసి, దసరాలోపు ఇళ్లను అందించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైడ్రా ఆర్డినెన్స్‌కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..
గాంధీజీ జయంతి సందర్భంగా మంత్రి లోకేష్ నివాళి..
హూక్కా సెంటర్‌పై పోలీసుల దాడులు..
అరసవిల్లిలో భక్తులకు కనువిందు చేసిన అద్భుత దృశ్యం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News