Marathon: సీఎం రేవంత్ రెడ్డికి హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ కానుక..

ABN, Publish Date - Aug 25 , 2024 | 12:22 PM

హైదరాబాద్: నగరంలో ఆదివారం ఉదయం రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన మారథాన్‌ను నగర సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి బాలయోగి స్టేడియం వరకు సాగే ఈ మారథాన్.. ఫిట్‌నెస్ అవగాహణ కోసం నిర్వహించారు. గచ్చిబౌలి స్టేడియంలో ఎన్ఎండీసీ (NMDC) మారథాన్-2024 బహుమతుల ప్రదాననోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు.

హైదరాబాద్: నగరంలో ఆదివారం ఉదయం రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన మారథాన్‌ను నగర సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి బాలయోగి స్టేడియం వరకు సాగే ఈ మారథాన్.. ఫిట్‌నెస్ అవగాహణ కోసం నిర్వహించారు. గచ్చిబౌలి స్టేడియంలో ఎన్ఎండీసీ (NMDC) మారథాన్-2024 బహుమతుల ప్రదాననోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్బంగా హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ తరఫు నుంచి ముఖ్యమంత్రికి చిరు కానుక సమర్పించారు. పసుపు రంగు టీ షర్టు వెనుక సీఎం పేరు, ముందు హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ లోగో ముద్రించి అందజేశారు. హైదరాబాద్ నగరంలో ఎక్కడైన ఈ టీషర్టు వేసుకుని పరిగెత్తినా హైదరాబాద్ రన్నర్స్ అని తెలిసిపోతుందన్నారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి విజేతలకు తన చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.


అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. క్రీడా కార్యక్రమాలకే గచ్చిబౌలి స్పోర్ట్స్‌ విలేజ్‌ను వినియోగిస్తామని, 2028 ఒలింపిక్స్‌లో తెలంగాణ అథ్లెట్లు ఎక్కువ పతకాలు సాధించేలా కృషి చేస్తామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి.. యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ప్రారంభిస్తామని ప్రకటించారు. ఖేలో ఇండియా నిర్వహణను తెలంగాణకు ఇవ్వాలని కేంద్రాన్ని అడిగామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు.


కాగా హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ 13వ ఎడిషన్ ఈరోజు (ఆదివారం) ఉదయం లాంఛనంగా ప్రారంభమైంది. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి బాలయోగి స్టేడియం వరకు ఈ మారథాన్ సాగింది. ఫుల్ మారథాన్‌ను జెండా ఊపి హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.


మారథాన్‌లో వివిధ దేశాల రన్నర్లు పాల్గొన్నారు. ప్రతి ఏడాది నిర్వహించే ఈ మారథాన్ ఫిట్‌నెస్ అవేర్‌నెస్ పెంచేందుకు దోహదం చేస్తోందని తెలిపారు. దేశంలోనే అతిపెద్ద రెండో మారథాన్ ఇదని వెల్లడించారు. 60, 70 ఏళ్లలో వచ్చే వ్యాధులు ఇప్పటి నుంచే యువత ఎదుర్కొంటున్నారని అన్నారు. కరోనా వచ్చిన తర్వాత ఆరోగ్యంపై ప్రజలు ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారని వివరించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా వ్యాయామం చేయాలని సూచించారు. ఈ మారథాన్‌లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి రన్నర్స్ పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుమలయ్య గుట్టకు పోటెత్తిన భక్తులు..

నేడు ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు

టీటీడీలో స్కామ్.. ఆ ముగ్గురిపై ఫిర్యాదులు..

హైడ్రా దూకుడు.. నెక్ట్స్ టార్గెట్ ఎవరు...?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 25 , 2024 | 12:22 PM