Share News

Hyderabad: బ్లాక్ మ్యాజిక్ కలకలం.. హడలెత్తిపోతున్న స్థానికులు

ABN , Publish Date - Sep 26 , 2024 | 09:32 PM

బ్లాక్ మ్యాజిక్ చేస్తున్న వ్యక్తి ఇంటికి ఎక్కువుగా జనాలు వస్తుండటం, వాహనాలు ఎక్కువుగా వస్తుండటంతో బస్తీ వాసులు బ్లాక్ మ్యాజిక్ చేస్తున్న వ్యక్తిని నిలదీశారు. దీంతో తమనే ప్రశ్నిస్తారా అంటూ బస్తీ యువకుడు నవాజ్ ఉద్దీన్‌పై బ్లాక్ మ్యాజిక్ చేస్తున్న వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు ..

Hyderabad: బ్లాక్ మ్యాజిక్ కలకలం.. హడలెత్తిపోతున్న స్థానికులు
Black Chain

హైదరాబాద్‌లో బ్లాక్ మ్యాజిక్ వ్యవహారం కలకలం రేపుతోంది. రాజేంద్రనగర్ దర్గా ఖలీజ్ ఖాన్‌ ప్రాంతంలో ఓ వ్యక్తి బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారంటూ బస్తీ వాసులు ఆరోపిస్తున్నారు. బ్లాక్ మ్యాజిక్ చేస్తున్న వ్యక్తి ఇంటికి ఎక్కువుగా జనాలు వస్తుండటం, వాహనాలు ఎక్కువుగా వస్తుండటంతో బస్తీ వాసులు బ్లాక్ మ్యాజిక్ చేస్తున్న వ్యక్తిని నిలదీశారు. దీంతో తమనే ప్రశ్నిస్తారా అంటూ బస్తీ యువకుడు నవాజ్ ఉద్దీన్‌పై బ్లాక్ మ్యాజిక్ చేస్తున్న వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు విచక్షణ రహితంగా దాడి చేశారని బస్తీ వాసులు ఆరోపిస్తున్నారు. దాడిలో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నవాజ్ ఉద్దీన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు యువకుడి కుటుంబ సభ్యులు తెలిపారు.

Madhavilatha: శ్రీవారికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా మాధవీలత ఏం చేశారంటే..


బ్లాక్ మ్యాజిక్‌కు ఉపయోగించిన వస్తువులను బస్తీలో పడేస్తున్నారని, వాటిని చూసి భయబ్రాంతులకు గురవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో బ్లాక్ మ్యాజిక్‌ చేస్తున్న వ్యక్తి వివరాలు చెప్పడానికి బస్తీ వాసులు భయపడుతున్నారు. తమను ఏమైనా చేస్తాడేమో అంటూ బస్తీ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఎట్టకేలకు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో బ్లాక్ మ్యాజిక్ చేస్తున్న షాదాబ్‌పై నవాజ్ ఉద్దీన్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Kollu Ravindra: నోటికొచ్చినట్లు వాగితే.. పళ్లురాలిపోతాయ్.. జాగ్రత్త అంటూ పేర్నినానిపై ఫైర్


బ్లాక్ చైన్ ఘటనలతో భయం..

హైదరాబాద్ నగరంలోని పలు బస్తీలతో పాటు తెలంగాణలోని కొన్ని గ్రామాల్లో అప్పుడప్పుడు బ్లాక్ మ్యాజిక్ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. బ్లాక్ మ్యాజిక్ ఘటనలతో చుట్టు పక్కల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కొంతమంది ఆకతాయిలు స్థానిక నివాసితులను భయపెట్టడానికి బ్లాక్ మ్యాజిక్ ఘటనలకు పాల్పడుతుండగా.. మరికొందరు కొన్ని రకాల పూజల పేరుతో బ్లాక్ మ్యాజిక్ చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. నేటి ఆధునిక కాలంలోనూ కొందరు మూఢనమ్మకాల పేరుతో ప్రజలను మెసం చేస్తున్న ఘటనలు అక్కడక్కడ చోటుచేసుకుంటున్నాయి. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నా బ్లాక్ మ్యాజిక్ వంటి ఘటనలు దురదృష్టకరమని విజ్ఞాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రామాలు, నగరాల్లోని బస్తీల్లో ప్రజల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకుని కొందరు బ్లాక్ మ్యాజిక్ పేరుతో సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అమాయక ప్రజలను మోసం చేస్తూ బ్లాక్ మ్యాజిక్‌కు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. బ్లాక్ మ్యాజిక్‌కు పాల్పడుతున్న వ్యక్తుల పేర్లను చెప్పడానికి భయపడుతున్న పరిస్థితులు ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పేర్లు బయటపెడితే తమకు ఏదైనా అపాయం తలపెడతారని కొందరు భయపడుతున్నట్లు తెలుస్తోంది.


AP Govt: సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి షోకాజ్ నోటీస్

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Latest Telugu News Click Here

Updated Date - Sep 26 , 2024 | 09:32 PM