Share News

Hydra : మూసీ వైపు దూసుకెళ్లనున్న హైడ్రా బుల్డోజర్లు

ABN , Publish Date - Sep 25 , 2024 | 10:35 AM

మూసీ నివాసితుల కోసం ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించింది. బుధవారం మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో మూసీ నివాసితుల ప్రాంతాలకు కలెక్టర్లు వెళ్ళనున్నారు. మూసీ ఆక్రమణల వివరాల సేకరణను రెవెన్యూ, హైడ్రా అధికారులు ప్రారంభించారు. వారం రోజుల్లో ప్రజలను ఒప్పించి ఇళ్లను ఖాళీ చేయించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Hydra : మూసీ వైపు దూసుకెళ్లనున్న హైడ్రా బుల్డోజర్లు

హైదరాబాద్: హైడ్రా (Hydra) బుల్డోజర్లు (Bulldozers) ఈసారి మూసీ (Musi) వైపు దూసుకెళ్లనున్నాయి. ఈ వారాంతంలో మూసీ ఆక్రమణల కూల్చివేతలపై (Demolition) హైడ్రా ఫోకస్ పెట్టింది. శని, ఆదివారాల్లో భారీగా మూసీ ఆక్రమణలను కూల్చివేయనున్నట్టు తెలుస్తోంది. ఆ రెండు రోజుల్లో కూల్చివేతలు పూర్తి చేసేలా హైడ్రా టార్గెట్ (Target) నిర్దేశించుకుంది. డే అండ్ నైట్ కూల్చివేతలు చేసేలా హైడ్రాకు అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు.

గోల్నాక, చాదర్‌ఘాట్, మూసారంబాగ్.. మూసి ఆక్రమణల కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో 1,350 మందికి హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లో ఇళ్లను హైడ్రా మార్క్ చేసింది. కాగా మూసీ నివాసితుల కోసం ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించింది. బుధవారం మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో మూసీ నివాసితుల ప్రాంతాలకు కలెక్టర్లు వెళ్లనున్నారు. మూసీ ఆక్రమణల వివరాల సేకరణను రెవెన్యూ, హైడ్రా అధికారులు ప్రారంభించారు. వారం రోజుల్లో ప్రజలను ఒప్పించి ఇళ్లను ఖాళీ చేయించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.


మూసీ నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు..

కాగా మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్ట్‌ అభివృద్ధిలో భాగంగా అక్కడ ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించిన క్రమంలో నిర్వాసితుల కుటుంబాలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు మూసీ పరీవాహక ప్రాంతంలో పదివేల కుటుంబాలున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సంఖ్య మరింతగా ఉంటుందని.. సుమారు 16 వేల కుటుంబాలుండొచ్చని అంచనా వేస్తున్నారు. వీళ్లందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను కేటాయించాలన్న సీఎం ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల కలెక్టర్లు, అధికారుల బృందం బుధవారం నుంచి ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారు. తొలి విడతలో రివర్‌ బెడ్‌లోని 1600 ఇళ్లను తొలగించే ప్రక్రియ వెంటనే మొదలవుతుందని చెప్పారు. తర్వాత బఫర్‌ జోన్‌లోని నిర్మాణాలను తొలగిస్తామన్నారు.


కాగా మూసీ పరీవాహక ప్రాంతంలో నివసించే పేదల ఇళ్లతో పాటు చెరువులు, నాలాల వద్ద ఉంటున్న పేద కుటుంబాల వివరాలను కూడా సేకరించాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. అర్హులైన పేదలందరికీ భరోసా కల్పించే ప్రయత్నం చేయాలన్నారు. ఒక్క పేద కుటుంబం కూడా రోడ్డున పడకూడదని, అర్హులందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కేటాయించాలని ఆదేశించారు. సీఎం రేవంత్‌ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌, హైదరాబాద్‌ మెట్రో రైలు అధికారులతో సమీక్ష నిర్వహించారు. మునిసిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్‌, మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఓఆర్‌ఆర్‌ లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమణలకు గురి కాకుండా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులను సీఎం రేవంత్‌ ఆదేశించారు. ఇందుకోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిని కమాండ్‌ కంట్రో ల్‌ సెంటర్‌కు అనుసంధానం చేయాలని చెప్పారు. ఓఆర్‌ఆర్‌ లోపల ఉన్న అన్ని చెరువులు, కుంటలు, నాలాలను గుర్తించి వాటి ఎఫ్టీఎల్‌, బఫర్‌ జోన్లను గుర్తించాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా వీటికి సంబంధించిన నివేదికను తయారుచేయాలన్నారు. ప్రతి ఆక్రమణలో అర్హులైన పేదలకు విధిగా పరిహారం అందేలా ప్రణాళిక రూపొందించాలని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ హయాంలోనే ఆ ప్రాజెక్టుకు నష్టం..

ఏపీ వరద బాధితులకు పరిహారం అందజేత

సీఎం సిద్ధరామయ్యకు బిగుస్తున్న ఉచ్చు..

రాజమండ్రిలో చిరుత సంచారం కలకలం..

భారీ వర్షానికి పొంగిన విజయవాడ పెద్దవాగు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 25 , 2024 | 11:35 AM