Share News

Hyderabad: నటితో అలా ప్రవర్తించిన ప్రముఖ యూట్యూబర్.. చివరికి ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Dec 18 , 2024 | 05:42 PM

లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ యూట్యూబర్ ప్రసాద్ బెహరాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఓ వెబ్ సీరిస్ షూటింగ్ సమయంలో హీరోయిన్‌తో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేశారు.

Hyderabad: నటితో అలా ప్రవర్తించిన ప్రముఖ యూట్యూబర్.. చివరికి ఏం జరిగిందంటే..
YouTuber Prasad Behra Arrest

హైదరాబాద్: లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ యూట్యూబర్ ప్రసాద్ బెహరా (YouTuber Prasad Behra)ను జూబ్లీహిల్స్ పోలీసులు (Jubilee hills police) అరెస్టు చేశారు. ఓ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో హీరోయిన్‌తో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేశారు. షూటింగ్ సమయంలో తనను అందరి ముందు పలుమార్లు అసభ్య పదజాలంతో దూషించాడని, అలాగే ప్రైవేటు భాగాలను తాకాడని, చెప్పలేని పదాలతో అవమానించాడని జూబ్లీహిల్స్ పోలీసులకు బాధిత యువతి ఫిర్యాదు చేసింది.


ఈ మేరకు ప్రసాద్ బెహరాపై 75(2),79, 351(2) బీఎన్ఎస్ సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. మా విడాకులు, పెళ్లి వారమండి, మెకానిక్ వెబ్ సిరీస్‌లతో నిందితుడు ప్రసాద్ బెహరా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల రిలీజైన కమిటీ కుర్రాళ్లు సినిమాతోనూ నటుడిగా మంచి గుర్తింపే వచ్చింది. కాగా, లైంగిక వేధింపుల కేసులో ప్రసాద్ అరెస్ట్ కావడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.


ఈ వార్తలు కూడా చదవండి:

Guntur: అరుదైన అవార్డు దక్కించుకున్న తెలుగు కవి ఎవరంటే..

Hyderabad: శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్.. కొడుకు కోసమేనా..

Updated Date - Dec 18 , 2024 | 05:57 PM