BRS: సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు.. ప్రకటించిన కేసీఆర్
ABN , Publish Date - Mar 23 , 2024 | 06:10 PM
సికింద్రాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌ని నిర్ణయిస్తూ ఆ పార్టీ అధినేత కేసీఆర్ శనివారం ప్రకటించారు. ఈ మేరకు పార్టీ శాసన సభ్యులు ప్రజాప్రతినిధులు ఇతర ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో చర్చించి అందరి అభిప్రాయం సేకరించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సికింద్రాబాద్: సికింద్రాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌ని నిర్ణయిస్తూ ఆ పార్టీ అధినేత కేసీఆర్ శనివారం ప్రకటించారు. ఈ మేరకు పార్టీ శాసన సభ్యులు ప్రజాప్రతినిధులు ఇతర ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో చర్చించి అందరి అభిప్రాయం సేకరించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్ నేతగా ఉద్యమ కాలం నుంచి నేటి వరకు పార్టీకి విధేయుడుగా వున్న పద్మారావు గౌడ్ అందరివాడుగా గుర్తింపు తెచ్చుకున్నారని పార్టీ నేతలు భావిస్తున్నారు.
అలాంటి వ్యక్తిని బరిలోకి దింపితే ఈజీగా గెలిచే అవకాశం ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. అంతకుముందు నిర్వహించిన అభిప్రాయ సేకరణలో పద్మారావుకే టికెట్ ఇవ్వడానికి ఒకే చెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకే అవకాశం ఇచ్చింది.
బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన దానం నాగేందర్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరగా.. ఆయన్ను సికింద్రాబాద్ నుంచి బరిలోకి దింపింది. బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు. ప్రస్తుతం కిషన్ రెడ్డి ఈ స్థానం నుంచే ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.