Share News

CM Revanth Reddy vs KCR: కేసీఆర్‌ కామెంట్స్‌కు రేవంత్ మాస్ కౌంటర్.. ఏమన్నారంటే..

ABN , Publish Date - Feb 13 , 2024 | 07:42 PM

CM Revanth Reddy vs KCR: నల్లగొండ బీఆర్ఎస్ పబ్లిక్ మీటింగ్‌లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ధీటైన కౌంటర్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తప్పులన్నీ చేసి ఇప్పుడు సత్యహరిశ్చంద్రుడిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ నిజంగా సత్య హరిశ్చంద్రుడే అయితే అసెంబ్లీకి రావాల్సి ఉండేనన్నారు. అలా రాకుండా కేసీఆర్ వ్యూహాత్మకంగా కాంగ్రెస్‌పై ఎదురు దాడి చేస్తున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు.

CM Revanth Reddy vs KCR: కేసీఆర్‌ కామెంట్స్‌కు రేవంత్ మాస్ కౌంటర్.. ఏమన్నారంటే..
CM Revanth Reddy vs KCR

హైదరాబాద్, ఫిబ్రవరి 13: నల్లగొండ బీఆర్ఎస్ పబ్లిక్ మీటింగ్‌లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ధీటైన కౌంటర్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తప్పులన్నీ చేసి ఇప్పుడు సత్యహరిశ్చంద్రుడిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ నిజంగా సత్య హరిశ్చంద్రుడే అయితే అసెంబ్లీకి రావాల్సి ఉండేనన్నారు. అలా రాకుండా కేసీఆర్ వ్యూహాత్మకంగా కాంగ్రెస్‌పై ఎదురు దాడి చేస్తున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు. మేడిగడ్డ బ్యారేజీలో కూలిన పిల్లర్లను సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంగళవారం నాడు పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలను ఎత్తి చూపారు సీఎం. ఇదే సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

రేవంత్ కామెంట్స్ యధావిధిగా..

‘కేసీఆర్ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పై ఎదురుదాడి చేస్తున్నారు. సత్యాహరిశ్చంద్రుడిలా మాట్లాడుతున్నారు. కేసీఆర్ నిజంగా సత్యహరిశ్చంద్రుడే అయితే అసెంబ్లీకి రావాల్సి ఉండే. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించింది బీఆర్ఎస్సే. నల్లగొండ సభకు వెళ్లిన కేసీఆర్.. అసెంబ్లీకి ఎందుకు రాలేదు? నల్లగొండ దగ్గరా? అసెంబ్లీ దగ్గరా? కేసీఆర్ సభ పెట్టి సానుభూతి పొందాలని పొందాలని చూస్తున్నారు. మీ దోపిడీకి మేడిగడ్డ బలైంది. అన్నారం, సుందిళ్ల సున్నమైంది. సక్కగలేని తీర్మానానికి నీ అల్లుడు స్వాతిముత్యం ఎలా మద్దతు తెలిపారు? తీర్మాణంలో లోపాలుంటే మీరు వచ్చి సవరించాల్సి ఉండే. ముఖ్యమంత్రి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని సభకు వచ్చి చెప్పాలి. ఉద్యమ ముసుగులో మంది పిల్లలను చంపి మేము అధికారం చేపట్టలేదు. మేడిగడ్డ కుంగినా కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదు. కాళేశ్వరం సమస్యను పక్కదారి పట్టించేందుకే నల్లగొండ సభ పెట్టారు. బాధ్యత విస్మరించి కేసీఆర్ సభకు రాకుండా పారిపోయారు. కుర్చిపోగానే కేసీఆర్‌కు ప్లోరైడ్ బాధితులు, నీళ్లు గుర్తుకొచ్చాయా?’ అని కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు.

రేపు సభకు రావాలే..

‘విపక్ష నేతగా కేసీఆర్ బుధవారం నాడు సభకు రావాలి. మీ స్వార్థం కోసం ప్రజలను వాడుకోవద్దు. KRMB విషయంలో ఏనుగు పోయింది తోక మిగిలింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో కేసీఆర్ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. నీళ్లు నింపితే మేడిగడ్డ కుప్పకూలుతుంది. ఇంతపెద్ద లోపాన్ని చిన్న తప్పిదంగా చెబుతున్నారు. ఎల్&టీ సంస్థను బ్లాక్ చేయాలా? వద్దా? అసెంబ్లీకి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టుపై మీ స్టాండ్ చెప్పాలి. కేసీఆర్ ఓట్లు అడుక్కోవడానికి కొత్త అవతారం ఎత్తారు. ఇప్పుడు వీల్ ఛైర్ డ్రామా ఆడుతున్నారు. నల్లగొండ సభకు జనం రాకుంటే మహబూబ్ నగర్ నుంచి తీసుకెళ్లారు.’ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సీఎం రేవంత్.

బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటేనా?

ఇదే సమయంలో బీజేపీ నేతలపైనా ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనా? ఆ రెండు పార్టీల ఎమ్మెల్యేలు ఒకే గ్రూప్‌నకు చెందిన వారా? అని ప్రశ్నించారు. మేడిగడ్డ సందర్శనకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలను ఆహ్వానించామని, బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌తో కుమ్మక్కు అవడానికే ఇక్కడికి రాలేదని సీఎం రేవంత్ ఆరోపించారు.

Updated Date - Feb 13 , 2024 | 07:42 PM