Share News

Metro Rail: మెట్రో ప్రయాణికులకు గుడ్‌ న్యూస్

ABN , Publish Date - Dec 31 , 2024 | 11:21 AM

Telangana: కొత్త సంవత్సరం వేళ మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్ చెప్పారు మెట్రో అధికారులు. సాధారణంగా ప్రతీరోజూ రాత్రి 11 గంటలకు మెట్రో రైలు(Metro rail) నిలిచిపోతుంది. న్యూఇయర్‌ వేళ మెట్రో రైళ్ల సమయాన్ని పొడగిస్తూ మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

Metro Rail: మెట్రో ప్రయాణికులకు గుడ్‌ న్యూస్
Metro rail

హైదరాబాద్, డిసెంబర్ 31: మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. న్యూఇయర్‌ను పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసేందుకు ప్రజలు ఉత్సాహం చూపుతున్నారు. కొత్త సంవత్సరానికి వెల్కమ్‌ చెప్పేందుకు ఇప్పటికే ఎన్నో ఈవెంట్‌లను ఏర్పాటు చేశారు. కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు అన్నీ సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా.. కొత్త సంవత్సరం వేళ మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్ చెప్పారు మెట్రో అధికారులు. సాధారణంగా ప్రతీరోజూ రాత్రి 11 గంటలకు మెట్రో రైలు(Metro rail) నిలిచిపోతుంది. న్యూఇయర్‌ వేళ మెట్రో రైళ్ల సమయాన్ని పొడగిస్తూ మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ అర్ధరాత్రి ఒంటి గంట 15 నిమిషాల వరకు మెట్రో రైలు అందుబాటులో ఉండనుంది. చివరి మెట్రో రైలు ప్రారంభమయ్యే స్టేషన్ నుంచి అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాలకు బయలుదేరి... అర్ధరాత్రి ఒంటి గంట 15 నిమిషాలకు చివరి స్టేషన్ మెట్రోరైలు చేరుకోనుంది. అయితే మద్యం సేవించి తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవటి రైల్వే అధికారులు హెచ్చరించారు.


మరోవైపు ఈరోజు తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ ఉచిత రవాణా సదుపాయం కల్పించింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఉచిత రవాణా సదుపాయాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలకు గురవుతారని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫోర్ వీలర్స్ అసోసియేషన్ తెలిపింది. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని ఫోర్ వీలర్ అసోసియేషన్ గిగ్ వర్కర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్, సైబరాబాద్ రాచకొండ పరిధిలో 500 కార్లు, 250 బైక్, టాక్సీలు, డ్రైవర్లు అందుబాటులో ఉంటారని సేఫ్ జర్నీ కోసం ఉచిత రవాణా సదుపాయాన్ని కల్పిస్తున్నామని ఫోర్ వీలర్స్ అసోసియేషన్ వెల్లడించింది.

మందుబాబులకు బంపర్ ఆఫర్.. పది తర్వాత పూర్తి ఫ్రీ..


అలాగే గ్రేటర్ పరిధిలో రేపు (బుధవారం) తెల్లవారుజాము వరకు ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులను టీజీఎస్ ఆర్టీసీ అందుబాటులో ఉంచనుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌తోపాటు ఐటీ కారిడార్‌ నుంచి నగర చివరి ప్రాంతాల వరకు అదనపు బస్సు సర్వీసులను తిప్పనుంది ఆర్టీసీ. ఈ సర్వీసులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

ఉగాది నుంచి ఉచితం

Ration Rice Case: దూకుడు పెంచిన పోలీసులు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 31 , 2024 | 11:59 AM