Share News

Ponnam Prabhakar: అబ్బే.. అలగలేదు.. అసలేం జరిగిందో చెప్పిన పొన్నం

ABN , Publish Date - Jul 09 , 2024 | 02:35 PM

భాగ్యనగరంలోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో ప్రోటోకాల్ రగడ నెలకొనడంతో నానా రచ్చ జరిగినట్లు వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి వెళ్లినప్పుడు ఆలయ అధికారులు..

Ponnam Prabhakar: అబ్బే.. అలగలేదు.. అసలేం జరిగిందో చెప్పిన పొన్నం

హైదరాబాద్: భాగ్యనగరంలోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో ప్రోటోకాల్ రగడ నెలకొనడంతో నానా రచ్చ జరిగినట్లు వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి వెళ్లినప్పుడు ఆలయ అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిలు అలకబూనారు.! అంతేకాదు.. ఆలయం బయట అరుగు మీదే కూర్చుండి పోయారు.! ఈ క్రమంలో అధికారులపై అసహనం, కోపంతో మంత్రి ఊగిపోయారనే టాక్ కూడా నడిచింది. అయితే అసలేం జరిగిందనే దానిపై మంత్రి, మేయర్ ఇద్దరూ ఫుల్ క్లారిటీ ఇచ్చుకున్నారు.


Protokal-Issue.jpg

అలాంటిదేమీ లేదే..!

తాను అలిగినట్లు వస్తున్న వార్తలను పొన్నం ఖండించారు. నేను అలగలేదు. మహిళలు వెళ్లే సమయంలో తోపులాట జరిగింది. మేయర్ విజయలక్ష్మి కూడా తోపులాటలో ఇబ్బంది పడ్డారు. తోపులాట నిలువరించేందుకు కొద్దిసేపు ఆగి అధికారులతో మాట్లాడాం. తోపులాట జరుగుతుంటే ఏం చేస్తున్నారని అధికారులను ప్రశ్నించాం. అమ్మవారి భక్తులం ఎందుకు అలుగుతాము..?. మహిళా రిపోర్టర్‌కు ఎదురైన చేదు అనుభవానికి క్షమాపణ చెబుతున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాంఅని పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు.


Ponnam-And-Mayor.jpg

మేం అలగడమేంటి..?

ఇదే ఘటనపై మేయర్ కూడా స్పందించారు. మా ప్రభుత్వంలో మాపై మేము ఎందుకు అలుగుతాము..?. తోపులాట వల్ల మహిళలు ఇబ్బంది పడుతున్నామని బయటే ఆగాం. అధికారులతో మాట్లాడి క్రౌడ్ మేనేజ్ చేయించాం. అమ్మవారి ముందు అలగడం ఉండదుఅని విజయలక్ష్మి ఘటనపై వివరించారు. కాగా.. తోపులాటలో మేయర్‌కు గాయాలు కూడా అయినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అటు మంత్రి, ఇటు మేయర్ ఇద్దరూ అధికారులపై రుసరుసలాడారని.. దీంతో ఇది పెద్ద బర్నింగ్ టాపిక్ అవ్వడంతో ఇలా మీడియా ముందుకు వచ్చారనే విమర్శలు అయితే గట్టిగానే వస్తున్నాయి.

అలిగిన మంత్రి, మేయర్


Updated Date - Jul 09 , 2024 | 02:45 PM