Share News

CM Revanth Reddy: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం.. ఏంటంటే

ABN , Publish Date - Sep 24 , 2024 | 03:00 PM

ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణకు హాజరు కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీచేసింది.

CM Revanth Reddy: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం.. ఏంటంటే
CM Revanth Reddy

హైదరాబాద్: ఓటుకు నోటు ఈడీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణకు హాజరు కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ రోజు జరిగిన విచారణకు మత్తయ్య ఒక్కరే హాజరయ్యారు. రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహ, వేం కృష్ణ కీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ హాజరు కాలేదు. ఈడీ కేసు విచారణలో నిందితులు హాజరు కాకపోవడంపై నాంపల్లి ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఈ రోజు విచారణకు మినహాయింపు ఇచ్చేందుకు అంగీకరించింది. తదుపరి విచారణకు తప్పకుండా హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. వచ్చేనెల 16వ తేదీకి విచారణను వాయిదా వేసింది. ఆ రోజు సీఎం రేవంత్ సహా నిందితులు అందరూ కోర్టుకు హాజరు కావాలని స్పష్టం చేసింది.


ఇదీ నేపథ్యం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీపెన్ సన్‌కు రేవంత్ రెడ్డి డబ్బులు ఎర చూశారని ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నారు. ఏసీబీ కేసు నమోదు చేయడంతో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లారు. తర్వాత బెయిల్ రావడంతో బయటకు వచ్చారు. ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసే సమయంలో ఆయన వద్ద ఉన్న బ్యాగులో రూ.50 లక్షల నగదు ఉంది. ఆ నగదు అక్రమంగా చలామణి జరిగిందని ఏసీబీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి రిఫర్ చేసింది. ఓటుకు నోటు కేసులో ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు.


ఈడీ విచారణ

ఓటుకు నోటు కేసులో ఏసీబీ విచారణతోపాటు ఈడీ విచారణ కూడా జరుగుతోంది. ఏసీబీ కేసును ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసును విచారించిన సర్వోన్నత న్యాయస్థానం మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు అంగీకరించలేదు. తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి సీఎం అయినందున కేసు దర్యాప్తు విషయంలో జోక్యం చేసుకోవద్దని రేవంత్ రెడ్డికి స్పష్టం చేసింది. ఓటుకు నోటు కేసులో జెరూసలెం మత్తయ్య ఒక్కరే ఏసీబీ కేసు, ఈడీ కేసులో విచారణకు హాజరవుతున్నారు. మిగతా నిందితులు గైర్హాజరు అవుతున్నారు. విచారణ మినహాయింపు కోరుతూ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఈడీ కేసులో నాంపల్లి కోర్టు తాజా ఆదేశాలతో అక్టోబర్ 16వ తేదీన ఏం జరగనుందనే ఉత్కంఠ నెలకొంది.

ఇవి కూడా చదవండి:

Pawan Kalyan: హీరో కార్తీకి పవన్ కల్యాణ్ వార్నింగ్

Tirumala Laddu Controversy: పొన్నవోలు, ప్రకాష్ రాజ్‌ వ్యాఖ్యలపై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన పవన్


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Sep 24 , 2024 | 03:34 PM