Share News

Nara Rohit: నటి సిరితో నారా రోహిత్ ఎంగేజ్ మెంట్..

ABN , Publish Date - Oct 13 , 2024 | 11:46 AM

నారా రోహిత్ తొలి సినిమా ‘బాణం’తోనే ప్రేక్షకులని ఆకట్టుకుని హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ ఇండస్ట్రీలో నీట్ అండ్ కామ్ పర్సనాలిటీ మెయింటైన్ చేస్తూ.. వైవిధ్యమైన చిత్రాలను సెలక్ట్ చేసుకుంటూ.. ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు.

Nara Rohit: నటి సిరితో  నారా రోహిత్ ఎంగేజ్ మెంట్..

హైదరాబాద్: టాలెంటెండ్ హీరో నారా రోహిత్ (Nara Rohit) ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఆయన రీసెంట్‌గా నటించిన ‘ప్రతినిధి 2’ (Prathinidhi 2) హీరోయిన్ సిరిలెల్లా (Siri Lella)ను వివాహమాడబోతున్నారు. వారి నిశ్చితార్థం ఆదివారం హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌ (Novatel Hotel)లోజరుగుతోంది.. ఈ నిశ్చితార్థానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu), ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, ఇంకా నారావారి ఫ్యామిలీ, అలాగే నందమూరి కుటుంబసభ్యులు ఈ శుభ కార్యక్రమానికి హాజరయ్యారు. సీఎం చంద్రబాబు హాజరవుతుండటంతో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. గన్నవరం ఎంఎల్ఎ యార్లగడ్డ వెంకటరావు, హీరో శ్రీవిష్ణు తదితరులు కూడా హాజరయ్యారు.


నారా రోహిత్ తొలి సినిమా ‘బాణం’తోనే ప్రేక్షకులను ఆకట్టుకుని హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ ఇండస్ట్రీలో నీట్ అండ్ కామ్ పర్సనాలిటీ మెయింటైన్ చేస్తూ.. వైవిధ్యమైన చిత్రాలను సెలక్ట్ చేసుకుంటూ.. ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు.


సీఎం నారా చంద్రబాబు నాయుడు తమ్ముడి కుమారుడైన నారా రోహిత్.. ఆ పేరుని మాత్రం ఎప్పుడూ వాడుకోలేదు. తన కష్టాన్ని నమ్ముకునే హీరోగా ఎదిగారు. ప్రస్తుతం నారా రోహిత్ వయసు నాలుగు పదులు దాటడంతో.. నారా ఫ్యామిలీ ఆయనను పెళ్లి చేసుకోవాలని కోరడంతో.. ‘ప్రతినిధి 2’ సినిమాలో తన సరసన నటించిన ‘సిరి’ విషయం చెప్పి.. పెళ్లికి సిద్ధమయినట్లు సమాచారం. ‘సిరి’ని ఆయన కొన్నాళ్లుగా ప్రేమిస్తున్నారనే టాక్ కూడా వినబడుతోంది. ఏదయితేనేం.. ప్రేమ ఉందో లేదో తెలియదు కానీ.. ఆ అమ్మాయినే రోహిత్ పెళ్లాడుతుండటంతో ఇండస్ట్రీలోని మరో జంట.. కపుల్ కాబోతున్నారంటూ అంతా.. ఆ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక నిశ్చితార్థం అనంతరం వారి పెళ్లి ఎప్పుడనేది అఫీషియల్‌గా ప్రకటిస్తారని తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్: రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్

విదేశీ మద్యం ఎమ్మార్పీ ధరపై అదనపు ప్రివిలేజ్ ఫీ

శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ..

ఓటమి అనేక పాటలు నేర్పిస్తుంది: జగ్గారెడ్డి

బన్నీ ఉత్సవంలో 50 మందికి పైగా గాయాలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 13 , 2024 | 11:59 AM