Share News

TG Police: న్యూఇయర్ వేడుకల్లో అలా చేశారో జాగ్రత్త.. పోలీసుల హెచ్చరిక

ABN , Publish Date - Dec 21 , 2024 | 02:03 PM

Telangana: నిఘా ఏర్పాటు చేశామన్నారు. లోకల్ పోలీసులతో కోఆర్డినేట్ చేసుకుంటూ ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. గత 15 రోజుల్లో 400 కోట్ల డ్రగ్స్‌ను పట్టుకున్నామని.. 266 డాగ్స్‌తో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేశామని చెప్పారు. 100 మీటర్ల దూరంలో ఓ ఇంటిపై పెంచుతున్న గంజాయి మొక్కలను కూడా డాగ్స్ గుర్తించాయన్నారు.

TG Police: న్యూఇయర్ వేడుకల్లో అలా చేశారో జాగ్రత్త.. పోలీసుల హెచ్చరిక
Narcotics Bureau SP Sai Chaitanya warns

హైదరాబాద్, డిసెంబర్ 21: మరికొద్దిరోజుల్లో న్యూఇయర్ రాబోతోంది. కొత్త సంవత్సరాన్ని ఎంతో ఘనంగా ఆహ్వానించేందుకు ఎన్నో ఈవెంట్లు చేస్తుంటారు. న్యూఇయర్ వేడుకలను ఎంతో గ్రాండ్‌గా నిర్వహిస్తుంటారు. పెద్ద పెద్ద ఈవెంట్లను ఏర్పాటు చేస్తుంటారు. అయితే న్యూఇయరే టార్గెట్‌గా కొందరు డ్రగ్ ఫెడ్లర్‌లు.. న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వినియోగానికి ప్రయత్నిస్తుంటారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి పలు విధాలుగా డ్రగ్స్‌ను నగరానికి తీసుకువచ్చేందుకు యత్నించారు. అయితే వారి చర్యలను పోలీసులు ఎప్పటికప్పుడు భగ్నం చేస్తూ వచ్చారు. డ్రగ్స్ సరఫరాపై గత కొద్దిరోజులుగా నిఘా పెట్టిన పోలీసులు.. పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. డ్రగ్స్‌తో పాటు గంజాయి, హెరాయిన్‌ను పోలీసులు పట్టుకున్నారు.

జగన్‌కు చంద్రబాబు బర్త్‌ డే విషెస్


ఇదిలా ఉండగా.. న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ అంశంపై నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సాయి చైతన్య ఏబీఎన్‌ - ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. న్యూ ఇయర్ వేడుకలు సందర్భంగా డ్రగ్స్‌పై పటిష్ట నిఘా ఏర్పాటు చేశామన్నారు. లోకల్ పోలీసులతో కోఆర్డినేట్ చేసుకుంటూ ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. గత 15 రోజుల్లో నాలుగున్నర కోట్ల డ్రగ్స్‌ను పట్టుకున్నామని.. 266 డాగ్స్‌తో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేశామని చెప్పారు. 100 మీటర్ల దూరంలో ఓ ఇంటిపై పెంచుతున్న గంజాయి మొక్కలను కూడా డాగ్స్ గుర్తించాయన్నారు.


ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్‌ను మన రాష్ట్రంలోకి రావడానికి ముందే అడ్డుకోగలుగుతున్నామని తెలిపారు. గత 15 రోజుల కాలంలో 641 కిలోల గంజాయి, 15 కిలోల గంజాయి చాక్లెట్లు, 1600 గ్రాముల హాష్ ఆయిల్, 1383 గ్రాముల ఎండిఎంఏ, 1000 గ్రాముల ఓపీఎం చరాస్, 53 గ్రాముల పాపిష్ట్ర ను పట్టుకున్నామని తెలిపారు. 44 గ్రాముల హెరాయిన్‌తో పాటు 148 కేసులను రిజిస్టర్ చేసి 315 మంది నేరస్తులను అరెస్ట్ చేశామని చెప్పారు. అలాగే ఈవెంట్ ఆర్గనైజర్లు డీజే ప్లేయర్ల ట్రాక్ రికార్డు చెక్ చేసుకోవాలన్నారు. ఈవెంట్లలో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సాయి చైతన్య హెచ్చరించారు.


70 లక్షల విలువ చేసే డ్రగ్స్ పట్టివేత...

మరోవైపు సంగారెడ్డి జిల్లాలో భారీగా నిషేధిత ఎండీఎంఏ డ్రగ్స్‌ను పోలీసులు పట్టుకున్నారు. దీనిపై సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ మీడియాతో మాట్లాడుతూ.. టీజీఎన్‌ఏబీ, సంగారెడ్డి పోలీసుల జాయింట్ ఆపరేషన్ నిర్వహించారని.. సుమారు 70 లక్షల విలువచేసే నిషేధిత ఎండీఎంఏ డ్రగ్స్‌ను పట్టుకున్నారని తెలిపారు. మహమ్మద్ సలీం, ముఖేష్ దుబే అనే ఇద్దరు డ్రగ్ ఫెడ్లర్స్‌ను అరెస్ట్ చేశారన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా కస్టమర్లకు డ్రగ్స్ సప్లై చేయడానికి నిందితులు వచ్చారని.. షేక్ అమీర్ అనే వ్యక్తికి 1000 గ్రాముల డ్రగ్స్‌ను అమ్మేందుకు ప్రయత్నం చేశారన్నారు. పక్కా సమాచారంతో ఇస్నాపూర్ వద్ద నిందితులను అరెస్టు చేశామన్నారు. ఢిల్లీలో ఉంటున్న నైజీరియన్‌లు జెమ్మి జెన్నీ అనే వ్యక్తులు వద్ద నుంచి నిందుతులు డ్రగ్స్ కొనుగోలు చేశారన్నారు.


ముంబైకి చెందిన మరో వ్యక్తి రైస్ కాన్ అనే వ్యక్తి కూడా డ్రగ్స్‌ను నగరానికి తీసుకొచ్చి అమ్ముతున్నాడని నేరస్తులు తెలిపారన్నారు. నిందితులు వద్ద నుంచి కిలో ఎండిఎంఏ డ్రగ్స్‌తో పాటు నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై ఎన్‌డీపీఎస్ ఆక్ట్ కింద కేసు నమోదు చేశామన్నారు. పట్టుబడ్డ నిందితులపై గతంలో డ్రగ్స్ కేసులు ఉన్నాయన్నారు. ప్రజారవాణా మార్గం ద్వారా నిందితులు డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు తీసుకువచ్చారని తెలిపారు. ఢిల్లీలో కిలో వెయ్యి రూపాయలకు కొనుగోలు చేసి హైదరాబాద్‌లో అత్యధిక ధరకు అమ్ముతున్నారన్నారు. వినియోగదారులను గుర్తించి వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ స్పష్టంచేశారు.


ఇవి కూడా చదవండి..

మీ నీతులు అవసరం లేదు.. బీఆర్‌ఎస్‌పై సీతక్క ఫైర్

Hyderabad: టార్గెట్‌ న్యూ ఇయర్‌ వేడుకలు.. ముంబై నుంచి నగరానికి ఎండీఎంఏ డ్రగ్స్‌

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 21 , 2024 | 02:20 PM