Share News

Cyber Crimes: మంచి ఉద్యోగం, ఆశించిన జీతం.. చైనా సైబర్ క్రిమినల్స్ దగ్గర ఉద్యోగం

ABN , Publish Date - Sep 13 , 2024 | 05:58 PM

నిరుద్యోగాన్ని ఆసరాగా తీసుకుని సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) కొత్తకొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ సారి కంబోడియా కేంద్రంగా నడుస్తున్న సైబర్ నేరగాళ్ల గుట్టు రట్టు చేశారు తెలంగాణ పోలీసులు.

Cyber Crimes: మంచి ఉద్యోగం, ఆశించిన జీతం.. చైనా సైబర్ క్రిమినల్స్ దగ్గర ఉద్యోగం

హైదరాబాద్: నిరుద్యోగాన్ని ఆసరాగా తీసుకుని సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) కొత్తకొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ సారి కంబోడియా కేంద్రంగా నడుస్తున్న సైబర్ నేరగాళ్ల గుట్టు రట్టు చేశారు తెలంగాణ పోలీసులు. ముంబయికి చెందిన ప్రియాంక శివకుమార్ అనే ఏజెంట్‌ను శుక్రవారం సైబర్ సెక్యూరిటీ బ్యూరో అరెస్ట్ చేసింది. ఏజెంట్‌ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిరుద్యోగ యువతే టార్గెట్‌గా మంచి ఉద్యోగం, ఆకర్షణీయమైన వేతనం అంటూ ఏజెంట్ ప్రకటనలు రిలీజ్ చేసేది. అలా ఒక్కో బాధితుడి నుంచి రూ.30 వేలు వసూలు చేసేది.

బాధితులను కంబోడియాకు పంపేందుకు వీసాలు కూడా సిద్ధం చేసుకుంది. అయితే చైనాకు చెందిన ఓ సైబర్ క్రైమ్ కంపెనీ ఆమెను ఏజెంట్‌గా రిక్రూట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రియాంక.. ఇక్కడి యువతను కంబోడియాకు పంపి సొమ్ము చేసుకునేది. ఒక్కో నియామకానికి ప్రియాంకకు నేరగాళ్లు 500 డాలర్లు చెల్లిస్తున్నారు. అలా భారత్ నుంచి వెళ్తున్న వారిని సైబర్ క్రిమినల్స్‌గా మార్చి కేటుగాళ్లు.. అమాయకుల నుంచి కోట్ల రూపాయలు కాజేస్తున్నారు.


వేడుకుంటున్న బాధితులు..

ప్రియాంక మోసాన్ని గుర్తించిన కొందరు కంబోడియాకు వెళ్లిన 3 రోజులకే స్వదేశానికి తిరిగి పంపాలని వేడుకుంటున్నారు. చెప్పిన పని చేయకుంటే బాధితులను మానసికంగా హింసిస్తున్నట్లు తెలుస్తోంది. బాధితుల్లో కొందరు నిందితుల చెర నుంచి తప్పించుకున్నారు. ఉద్యోగం పేరుతో సైబర్ నేరం చేయాలని తమపై ఒత్తిడి చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. నెలల పాటు వేధింపులకు పాల్పడిన తర్వాత తిరిగి తమ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు వాపోయారు. బిట్ కాయిన్ల రూపంలో డబ్బులు చెల్లించాలని చిత్ర హింసలకు గురి చేసినట్లు చెప్పారు. ఇలా.. సైబర్ నేరగాళ్లు డబ్బు ఆశ చూపి ఎంతోమందిని మోసం చేసిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. మంచి జీవితం, విదేశాల్లో ఉద్యోగం అంటూ చేసే ప్రకటనలను నమ్మకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

For Latest News and National News click here

Updated Date - Sep 13 , 2024 | 05:58 PM