Share News

Road Accident: రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు మృతి

ABN , Publish Date - Jan 05 , 2024 | 09:47 AM

Andhrapradesh: నగరంలోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధి గౌరెల్లి పాపయ్ గూడా చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న తండ్రీకొడుకులను టిప్పర్ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కుత్బుల్లాపూర్‌కు చెందిన తండ్రి కుమార్, కొడుడు ప్రదీప్ (7వ తరగతి)గా గుర్తించారు.

Road Accident: రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు మృతి

హైదరాబాద్, జనవరి 5: నగరంలోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధి గౌరెల్లి పాపయ్ గూడా చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న తండ్రీకొడుకులను టిప్పర్ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కుత్బుల్లాపూర్‌కు చెందిన తండ్రి కుమార్, కొడుడు ప్రదీప్ (7వ తరగతి)గా గుర్తించారు. ప్రమాద సమయంలో టిప్పర్ బైక్‌ను ఢీకొనడంతో టిప్పర్ క్యాబిన్ భాగంలో మంటలు చెలరేగాయి. దీంతో టిప్పర్ ముందు భాగంగా పూర్తి దగ్ధమైంది. ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.

సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తండ్రీకొడుకు మృతిచెందడంతో కుత్బుల్లాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 05 , 2024 | 09:47 AM