Share News

ఉపముఖ్యమంత్రి ఇంట్లో భారీ చోరీ.. దోచుకుంది వారేనట..

ABN , Publish Date - Sep 27 , 2024 | 05:47 PM

Hyderabad: తెలుగు రాష్ట్రాల్లోనే సంచలన ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో కీలకమైన ఉపముఖ్యమంత్రి ఇంట్లోనే దొంగలు పడ్డారు. భారీగా సొమ్ములను ఎత్తుకెళ్లారు. ఉపముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది..

ఉపముఖ్యమంత్రి ఇంట్లో భారీ చోరీ.. దోచుకుంది వారేనట..
Robbery in Deputy CM House

హైదరాబాద్, సెప్టెంబర్ 27: తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇంట్లో దొంగలు పడ్డారు. ప్రభుత్వంలో టాప్ 2 ప్లేస్‌లో ఉన్న భట్టి ఇంట్లోనే దొంగలు పడటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన ఇంట్లోంచి భారీగా నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లినట్లు సమాచారం. బంజారాహిల్స్ రోడ్ నెంబర్‌ 14లోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జరిగింది. ఈ దొంగతనంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఖాకీలు. నిందితుల ఆచూకీ కోసం గాలించగా.. వారంతా పశ్చిమబెంగాల్‌లో ఉన్నట్లు గుర్తించారు. నిందితులను ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ చేశారు బెంగాల్ పోలీసులు. నిందితులు బీహార్‌కు చెందిన రోషన్ కుమార్ మండల్, ఉదయ్ కుమార్ ఠాకూర్‌గా గుర్తించారు. వీరి వద్ద నుంచి రూ. 2.2 లక్షల నగదు, 100 గ్రాముల బంగారం, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బెంగాల్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేయడంతో.. వారిని అదుపులోకి తీసుకునేందుకు బెంగాల్‌కు వెళ్లారు బంజారాహిల్స్.


మోహన్ బాబు ఇంట్లోనూ చోరీ..

ఇటీవల టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ఇంట్లోనూ చోరీ జరిగింది. ఇంట్లో పని చేసే వ్యక్తే ఈ చోరీకి పాల్పడ్డాడు. ఏకంగా రూ. 10 లక్షలు ఎత్తుకెళ్లాడు. మోహన్ బాబు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఆ దొంగను పట్టుకున్నారు. తిరుపతిలో నిందితుడిని గుర్తించిన పోలీసులు.. అతను దోచుకున్న సొమ్మును రికవరీ చేశారు. ఇప్పుడు భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జరగడం సంచలనంగా మారింది.


నమ్మేదెలా..?

నమ్మి తీసుకొచ్చి.. ఇంట్లో పని కల్పించి.. ఆశ్రయమిస్తే కొందరు కేటుగాళ్లు ఇలా విశ్వాస ఘాతుకానికి పాల్పడుతున్నారు. అన్నం పెట్టిన ఇంటికే కన్నం పెడుతున్నారు. దీంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖుల ఇళ్లలోనే ఇలా జరిగితే.. సామాన్యుల ఇళ్ల పరిస్థితి ఏంటోనని ఆందోళన చెందుతున్నారు. కొత్త వారిని పనిలో పెట్టుకోవాలంటేనే జంకుతున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. పని పేరుతో ఇళ్లలో చేరిపోయి.. దోపిడీలకు పాల్పడిన ఘటనలు నగరంలో చాలా వెలుగుచూశాయి.


Also Read:

తిరుమల పర్యటన రద్దు చేసుకున్న వైసీపీ అధినేత

క్లాస్ రూమ్‌లో మమ్మీ సినిమా చూపించిన టీచర్..

తండ్రి, కూతుళ్ల డ్యాన్స్ చూస్తే పరేషాన్

For More Telangana News and Telugu News..

Updated Date - Sep 27 , 2024 | 05:47 PM