Secunderabad: రైలు ప్రయాణికులు గుడ్ న్యూస్.. ఇకపై అన్‌రిజర్వ్ టికెట్లు ఫోన్లోనే ఇలా ఈజీగా బుక్ చేసుకోవచ్చు
ABN , Publish Date - Mar 21 , 2024 | 08:41 PM
ఇన్నాళ్లు రిజర్వ్ రైలు టికెట్లను మాత్రమే ఫోన్లో బుక్ చేసే సదుపాయం ఉండేది. అయితే రైల్వే శాఖ తాజా నిర్ణయంతో అన్ రిజర్వ్ సీట్లకు కూడా ఆన్‌లైన్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని 14 స్టేషన్‌లలో విస్తరించి ఉన్న 31 కౌంటర్లలో పైలట్ ప్రాజెక్టుగా క్యూఆర్ కోడ్ చెల్లింపు వ్యవస్థను ప్రవేశపెట్టారు.
హైదరాబాద్: ఇన్నాళ్లు రిజర్వ్ రైలు టికెట్లను మాత్రమే ఫోన్లో బుక్ చేసే సదుపాయం ఉండేది. అయితే రైల్వే శాఖ తాజా నిర్ణయంతో అన్ రిజర్వ్ సీట్లకు కూడా ఆన్‌లైన్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని 14 స్టేషన్‌లలో విస్తరించి ఉన్న 31 కౌంటర్లలో పైలట్ ప్రాజెక్టుగా క్యూఆర్ కోడ్ చెల్లింపు వ్యవస్థను ప్రవేశపెట్టారు. సాధారణ బుకింగ్ కౌంటర్ల ద్వారా అన్ రిజర్వ్ చేయని టికెట్లను కొనుగోలు చేయవచ్చని దక్షిణ మధ్య రైల్వే గురువారం తెలిపింది.
ఈ సదుపాయం సికింద్రాబాద్, హైదరాబాద్, కాజీపేట, బేగంపేట, వరంగల్, మంచిర్యాల, లింగంపల్లి, హైటెక్ సిటీ, జేమ్స్ స్ట్రీట్, మహబూబాబాద్, బెల్లంపల్లి, ఫతేనగర్ బ్రిడ్జి, సిర్పూర్ కాగజ్‌నగర్, వికారాబాద్ స్టేషన్లలో అందుబాటులో ఉందని అధికారిక ప్రకటనలో వెల్లడించింది. నగదు రహిత టికెట్ కొనుగోలులో ఇది కీలకమైన ముందడుగని రైల్వే అధికారులు చెబుతున్నారు.
ప్రయాణికులు ఇకపై ముఖ్యమైన స్టేషన్ల బుకింగ్ కౌంటర్ల వెలుపల ఏర్పాటు చేసిన ఫేర్ రిపీటర్లలో క్లర్క్ నమోదు చేసిన వివరాలను చెక్ చేయవచ్చు. ఇటువంటి వివరాలలో సాధారణంగా బోర్డింగ్, డీబోర్డింగ్ స్టేషన్లు, క్లాస్, పెద్దలు/పిల్లల సంఖ్య, ఛార్జీలు ఉంటాయి. ఛార్జీల కోసం QR కోడ్ ఉంటుంది.
దాన్ని ఫేర్ రిపీటర్‌లలో ప్రదర్శిస్తారు. ఛార్జ్ చెల్లించడానికి ప్రయాణీకులు తమ మొబైల్ ఫోన్‌లలోని UPI యాప్‌లతో దీన్ని స్కాన్ చేయవచ్చు. రసీదుని నిర్ధారించిన తర్వాత, టికెట్ జనరేట్ అవుతుంది. రిజర్వ్ చేయని టిక్కెట్ల కొనుగోలు కోసం డిజిటల్ చెల్లింపు ఆప్షన్‌ను ప్రవేశపెట్టినందుకు వాణిజ్య, సాంకేతిక సిబ్బంది కృషిని జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ప్రశంసించారు.