Share News

TG Highcourt: కేటీఆర్ పిటిషన్‌పై విచారణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

ABN , Publish Date - Dec 20 , 2024 | 02:31 PM

Telangana: మాజీ మంత్రి కేటీఆర్‌ వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌‌‌‌ను విచారించేందుకు తెలంగాణ హైకోర్టు అంగీకరించింది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేయాలని హైకోర్టును మాజీ మంత్రి ఆశ్రయించారు.

TG Highcourt: కేటీఆర్ పిటిషన్‌పై విచారణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
Telangana High Court

హైదరబాద్, డిసెంబర్ 20: ఫార్ములా ఈరేస్ కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు (Telangana Highcourt) విచారణకు స్వీకరించింది. జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్‌లో మరికాసేపట్లో వాదనలు మొదలుకానున్నాయి. ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఏసీబీ ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని హైకోర్టును మాజీ మంత్రి ఆశ్రయించారు. ఏసీబీ దర్యాప్తుపై కూడా స్టే ఇవ్వాల్సిందిగా హైకోర్టును కేటీఆర్ కోరారు.

అలా చేస్తే చర్యలు తీసుకుంటా.. అధికారులకు సీఎం చంద్రబాబు వార్నింగ్


కేటీఆర్ పిటిషన్‌ కాపీలో కీలక అంశాలు...

అలాగే హైకోర్టులో వేసిన పిటిషన్‌ కాపీలో పలు కీలక అంశాలను కేటీఆర్ పొందుపర్చారు. ‘‘రాజకీయ దురుద్దేశంతోనే నాపై కేసు పెట్టారు. ప్రైవేట్ సంస్థకు లబ్ధి చేకూర్చామని ఎఫ్ఐఆర్‌లో చెప్పారు, కానీ ప్రైవేట్ సంస్థను నిందితుల జాబితాలో చేర్చలేదు’’ అని అన్నారు. ఏసీబీతో పాటు ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్‌ను ప్రతివాదిగా చేర్చారు కేటీఆర్. అగ్రిమెంట్‌కు ముందు నిధులు ఎఫ్‌ఈవో పంపడం ఉలంఘన కాదన్నారు. దీనికి ఐపీసీ 409 సెక్షన్ వర్తించదని తెలిపారు. 2023 అక్టోబర్ 30 రోజు చేసుకున్న అగ్రిమెంట్ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదని వెల్లడించారు మాజీ మంత్రి. ముందుగా చేసుకున్న అగ్రిమెంట్‌కు ఇది కొనసాగింపు మాత్రమే అని.. దీనికి పీసీ యాక్ట్‌కు సంబంధం లేదన్నారు.

అది చంద్రబాబుతోనే సాధ్యం: భువనేశ్వరి


ఈ అగ్రిమెంట్ ద్వారా వ్యక్తిగతంగా తాను లాభపడినట్టు ఎక్కడా ఎఫ్‌ఐఆర్‌లో పొందపర్చలేదన్నారు. పొలిటికల్ మైలేజ్, రాజకీయంగా దెబ్బ తీసేందుకు కేస్ పెట్టారని తెలిపారు. చాలా సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీ నేతల అరెస్ట్‌లు ఉంటాయని బహిరంగగానే మంత్రి మాట్లాడారని.. ప్రతిపక్ష పార్టీ నేతలను టార్గెట్ చేసి ఏదో ఒక తప్పుడు కేస్ పెట్టి అరెస్ట్ చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే పలు సుప్రీం కోర్టు జడ్జిమెంట్‌లను పిటిషన్ కాపీలో కేటీఆర్ జతపరిచారు. మొత్తం మూడు సుప్రీం కోర్టు జడ్జిమెంట్‌లను కేటీఆర్ అటాచ్ చేశారు. యూపీకి చెందిన లలిత కుమార్, మహారాష్ట్రకు చెందిన చరణ్ సింగ్, ఏపీ రాష్ట్రానికి చెందిన రాఘవేందర్‌ కేసులలోని జడ్జిమెంట్‌ల కాపీలను కేటీఆర్ తన పిటిషన్‌కు జతచేశారు.


ఇవి కూడా చదవండి...

Lagacharla Case: ప్రభుత్వానికి వ్యతిరేకంగా లగచర్ల రైతుల నినాదాలు..

కేటీఆర్‌ ఎపిసోడ్‌: రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 20 , 2024 | 02:55 PM