Share News

TGPSC: గుడ్ న్యూస్.. గ్రూప్-2 పరీక్ష తేదీ ప్రకటన..?

ABN , Publish Date - Aug 22 , 2024 | 04:10 PM

గ్రూప్-2 పరీక్ష తేదీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. డిసెంబర్ 15,16వ తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని గురువారం నాడు ఒక ప్రకటనలో పేర్కొంది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్ష ఉంటుందని వెల్లడించింది. గ్రూప్-2లో మొత్తం 783 పోస్టులు ఉన్నాయి.

TGPSC:  గుడ్ న్యూస్.. గ్రూప్-2 పరీక్ష తేదీ ప్రకటన..?
Group-2 Exam Date

హైదరాబాద్: గ్రూప్-2 పరీక్ష తేదీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. డిసెంబర్ 15,16వ తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని గురువారం నాడు ఒక ప్రకటనలో పేర్కొంది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్ష ఉంటుందని వెల్లడించింది. గ్రూప్-2లో మొత్తం 783 పోస్టులు ఉన్నాయి. గ్రూప్-2 పోస్టులకు ఈ నెల 7,8 తేదీల్లో పరీక్ష నిర్వహించాల్సి ఉంది. డీఎస్పీ, గ్రూప్-2 పరీక్ష మధ్య వారం రోజుల మాత్రమే గ్యాప్ ఉంది. డీఎస్పీకి ప్రిపేరయ్యే వారు గ్రూప్స్ రాయడంలో ఇబ్బంది పడతారని కమిషన్ తేదీని మార్చింది. డిసెంబర్ నెలలో నిర్వహిస్తామని తాజాగా ప్రకటించింది. గ్రూప్-2 పరీక్ష కోసం 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

Updated Date - Aug 22 , 2024 | 04:32 PM