Hyderabad: 9వ అంతస్తుపై నుంచి కింద పడి యువతి మృతి...
ABN , Publish Date - Nov 27 , 2024 | 01:15 PM
పిల్లలను కనివ్వడం కోసం ఆ యువతితో రూ. 10 లక్షల డీల్‌ను కుదుర్చుకున్నాడు. అయితే గత కొన్నాళ్లుగా రాజేష్ బాబు ప్రవర్తన నచ్చకపోవడంతో యువతి అశ్విత సింగ్ పారిపోవడానికి ప్రయత్నించింది. తప్పించుకునే క్రమంలో ప్రమాదవశాత్తు మై హోమ్ భుజ తొమ్మిదవ అంతస్తుపై నుంచి కిందపడి మృతి చెందింది.
హైదరాబాద్: మాదాపూర్‌లో దారుణం జరిగింది. మై హోమ్ భుజ (My Home Bhuj) తొమ్మిదవ అంతస్తుపై (9th floor) నుంచి ఓ యువతి ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందింది. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన అశ్విత సింగ్(25) (Ashvita Singh) సరోగసి (Surrogacy) ద్వారా పిల్లలను కనివ్వడం కోసం అశ్విత సింగ్‌ను రాజేష్ బాబు (Rajesh Babu) అనే వ్యక్తి తీసుకువచ్చాడు. పిల్లలను కనివ్వడం కోసం ఆ యువతితో రూ. 10 లక్షల డీల్‌ను కుదుర్చుకున్నాడు. అయితే గత కొన్నాళ్లుగా రాజేష్ బాబు ప్రవర్తన నచ్చకపోవడంతో యువతి అశ్విత సింగ్ పారిపోవడానికి ప్రయత్నించింది. తప్పించుకునే క్రమంలో ప్రమాదవశాత్తు మై హోమ్ భుజ తొమ్మిదవ అంతస్తుపై నుంచి కిందపడి మృతి చెందింది. ఆమెకు భర్త, నాలుగు సంవత్సరాల బాబు ఉన్నాడు. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. రాజేష్ బాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా భారత కేంద్ర ప్రభుత్వం తాజాగా సరోగసీ నిబంధనలకు మార్పులు చేసింది. సంబంధిత సవరణలను విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో తెలిపింది. పిల్లలు కనలేని తల్లిదండ్రులకు సరోగసీ (అద్దె గర్భం) ఒక వరంలా మారింది. సరోగసీ ద్వారా ఎవరైనా మహిళ ఇద్దరు దంపతుల కోసం బిడ్డను కనడానికి అనుమతి ఉంటుంది. బిడ్డ జన్మించిన తర్వాత సంబంధిత దంపతులకు అప్పగించాలి. వైద్యపరమైన కారణాలు, ఇతర లోపాలతో బిడ్డకు జన్మనివ్వలేని దంపతులకు సరోగసీని ఉపయోగించుకునే అవకాశాన్ని చట్టం కల్పించింది. అయితే పిల్లలను కనడంలో వైద్యపరమైన సవాళ్లు ఎదుర్కొంటున్న జంటలకు మరిన్ని ఆప్షన్లు, సౌలభ్యాన్ని అందించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం తాజాగా సరోగసీ నిబంధనలకు మార్పులు చేసింది.
గత నిబంధనల ప్రకారం.. వంధ్యత్వం ఉన్న వివాహిత జంటలు మాత్రమే సరోగసీని ఉపయోగించుకోవాలి. వీర్యం, అండాలు వారివి లేదా వారి దగ్గరి బంధువులవి అయి ఉండాలి. ఇప్పుడు.. భార్య లేదా భర్త అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని జిల్లా మెడికల్ బోర్డ్ ధ్రువీకరిస్తే, వివాహిత జంటలో ఒక భాగస్వామి ఎగ్, లేదా స్పెర్మ్‌ను ఉపయోగించలేని పరిస్థితి ఎదురైనప్పుడు, వారు సరోగసీ కోసం దాత ఎగ్ లేదా స్పెర్మ్‌ను ఉపయోగించుకునే అనుమతి ఉంటుంది.
మరోవైపు ఏఆర్‌టీ(అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్), సరోగసీ, పీసీఅండ్‌పీఎన్‌డీటీ యాక్ట్‌ను కాకినాడ జిల్లాలో ప్రతిష్టంగా అమలు చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్ జె.నరసింహనాయక్ అన్నారు. ఏఆర్‌టీ లెవెల్-2కు నూతనంగా నమోదు చేసుకున్న ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్‌ను ఏఆర్‌టీ డిస్ట్రిక్ట్ టీమ్ సోమవారం తనిఖీ చేసిందని తద్వారా ఆ సెంటర్ అప్రూవల్ కోసం జిల్లా మీటింగ్‌లో కలెక్టర్ ఆమోదించి సదరు సెంటర్‌కు పర్మిషన్ ఇస్తామన్నారు. లెవెల్-1, 2 ప్రొసీజర్లు రిజిస్టర్ కాకుండా గూగుల్, వాట్సప్, టెలీగ్రాం, పోస్టర్లు యూట్యూబ్, ప్లాంప్లెట్స్, గోడపత్రికలు, హోర్డింగ్‌ల ద్వారా ఏఆర్‌టీ, సరోగసీ రిజిస్టర్ కా ని సెంటర్లు ప్రకటనలు ఇస్తే అటువంటి యాజమాన్యం చట్టరీత్యా శిక్షార్హులని డీఎంహెచ్‌వో డాక్టర్ నాయక్ ఒక ప్రకటనలో హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుపతన్న బెయిల్ ఫిటిషన్ వాయిదా..
వాదంలో బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక
హైడ్రా రంగనాథ్‌కు బక్క జడ్సన్ సవాల్..
విజయపాల్‌ను కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాట్లు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News