Hospital: నిలోఫర్ వద్ద శిశువు కిడ్నాప్
ABN , Publish Date - Nov 24 , 2024 | 03:48 AM
చికిత్స కోసం నిలోఫర్ ఆస్పత్రికి తీసుకొచ్చిన నెలరోజుల శిశువును గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడు.
మంగళ్‌హాట్, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): చికిత్స కోసం నిలోఫర్ ఆస్పత్రికి తీసుకొచ్చిన నెలరోజుల శిశువును గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడు. జహీరాబాద్‌కు చెందిన హసీనా బేగం- గఫార్ దంపతులకు నెలక్రితం బాబు జన్మించాడు. ఆ చిన్నారికి కామెర్లు అవ్వడంతో చికిత్స కోసం నిలోఫర్‌లో చేర్చారు. బాబు ఆరోగ్యం మెరుగుపడడంతో వైద్యులు శనివారం డిశ్చార్జ్ చేశారు.
దాంతో అమ్మ, అమ్మమ్మ చిన్నారిని తీసుకుని మెయిన్ గేటు వద్దకు వచ్చారు. అప్పుడు గుర్తు తెలియని వ్యక్తి వారితో మాటలు కలిపి వారి దృష్టి మరల్చి చిన్నారిని తీసుకుని పారిపోయాడు. దాంతో బాబు అమ్మ, అమ్మమ్మ నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.