TG: నేటి నుంచి ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు
ABN , Publish Date - May 24 , 2024 | 04:38 AM
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం (24వ తేదీ) నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్3వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం (24వ తేదీ) నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్3వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
హైదరాబాద్, మే 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం (24వ తేదీ) నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్3వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఈ పరీక్షలు రాసేందుకు సుమారు 4.27 లక్షల మంది విద్యార్థులు ఫీజు చెల్లించారు. మొదటి, రెండో ఏడాది విద్యార్థుల కోసం రోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. మొదటి సెషన్‌ను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, రెండో సెషన్‌ను మధ్యాహ్నం 12.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు.
నేడు పాలీసెట్ ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలో శుక్రవారం పాలీసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందుకోసం 56,764 మంది ఎంపీసీ, 36,044 మంది బైపీసీ విద్యార్థులు ఫీజు చెల్లించారు. ఈ పరీక్ష కోసం 259 కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాగా, రాష్ట్రంలో గురువారం నిర్వహించిన ఎడ్‌సెట్‌కు 87శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.