Komati Reddy: థ్యాంక్యూ సార్.!
ABN , Publish Date - Jun 07 , 2024 | 04:01 AM
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి సుకన్య ధన్యవాదాలు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలానికి చెందిన ఆమె ఈ మేరకు గురువారం సచివాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.
మంత్రి కోమటిరెడ్డికి క్రీడాకారిణి తేజావత్ సుకన్య ధన్యవాదాలు
హైదరాబాద్, జూన్ 6(ఆంధ్రజ్యోతి): మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి సుకన్య ధన్యవాదాలు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలానికి చెందిన ఆమె ఈ మేరకు గురువారం సచివాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల టెక్సా్‌సలో జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్‌లో ఆమె టాప్ 8వ ర్యాంకు సాధించారు. అయితే ఈ చాంపియన్‌షి్‌పలో పాల్గొనేందుకు సుకన్యకు తన కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి ఫౌండేషన్ ద్వారా మంత్రి సహకారం అందించారు.
అలాగే జూలైలో దక్షిణాఫ్రికాలో జరగనున్న ఏషియా, ఆఫ్రికా, పసిఫిక్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు వెళ్లేందుకు కూడా సంపూర్ణ సహకారం అందిస్తానని కోమటిరెడ్డి ఆమెకు హామీ ఇచ్చారు. తనలాంటి ఎందరో క్రీడాకారులకు మంత్రి అండగా నిలుస్తున్నారని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.