Jagga Reddy: మీ నాన్నకు అలా మాట్లాడకూడదని బుద్ధి చెప్పు కేటీఆర్.. జగ్గారెడ్డి ఫైర్
ABN , Publish Date - Feb 28 , 2024 | 05:47 PM
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) తాజాగా మాజీ సీఎం కేసీఆర్‌పై (KCR) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘మేడిగడ్డనా? బొందలగడ్డనా? ఏం పీకడానికి మేడిగడ్డకు పోతున్నారు’’ అని కేసీఆర్ మాట్లాడారని.. ముఖ్యమంత్రిగా పని చేసిన ఓ వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడటం సమంజసమేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) తాజాగా మాజీ సీఎం కేసీఆర్‌పై (KCR) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘మేడిగడ్డనా? బొందలగడ్డనా? ఏం పీకడానికి మేడిగడ్డకు పోతున్నారు’’ అని కేసీఆర్ మాట్లాడారని.. ముఖ్యమంత్రిగా పని చేసిన ఓ వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడటం సమంజసమేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 70 ఏళ్ల కేసీఆర్‌కే అంత కోసం వస్తే.. యంగ్ డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy), భట్టి విక్రమార్కకు (Bhatti Vikramarka) ఆవేశం రాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ చేసిన అవినీతిని బయటపెట్టడానికే తాము మేడిగడ్డకు వెళ్లామని ఉద్ఘాటించారు.
‘‘కేటీఆర్ (KTR).. మీ నాన్నకు అలా మాట్లాడకూడదని బుద్ది చెప్పు’’ అని జగ్గారెడ్డి సూచించారు. అలాగే.. మేడిగడ్డని బొందలగడ్డతో పోల్చకూడదని మీ మేనమేమ అయిన కేసీఆర్‌కు చెప్పు అని హరీష్ రావుకి (Harish Rao) చెప్పారు. మేడిగడ్డను బొందలగడ్డతో పోల్చిన కేసీఆర్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పేదాకా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను వదిలేదే లేదన్నారు. ప్రభుత్వం మేడిగడ్డకు రమ్మన్నప్పుడు కేసీఆర్ ఎందుకు రాలేదన్న ఆయన.. ఇప్పుడు మీరు రమ్మంటే మేమెందుకు వస్తాం? అని కౌంటర్ ఇచ్చారు. కడియం శ్రీహరి గురించి మాట్లాడి టైం వృద్ధా అని, బాల్క సుమన్ ఒక బచ్చా అని సెటైర్లు వేశారు.
ఇక ఈ ప్రపంచంలో ప్రజలెవ్వరూ దేవుడిని మొక్కడం లేదు, మేము మాత్రమే మొక్కుతున్నాం అన్నట్లుగా ఉంది బండి సంజయ్ (Bandi Sanjay) వ్యవహారమని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. శ్రీరాముడు బీజేపీలో కొంతమందికే దేవుడా? అని ప్రశ్నించారు. శ్రీ రాముడు తన తల్లిని గౌరవించే మహానుభావుడని, తల్లి మాటలు కాదనకుండా వనవాసానికి పోయిన గొప్ప వ్యక్తి అని చెప్పారు. కానీ.. బండి సంజయ్‌లో రాముడి విలువలు ఏమాత్రం లేవని తూర్పారపట్టారు. పొన్నo ప్రభాకర్ (Ponnam Prabhakar) తల్లిపై కామెంట్ చేసి.. శ్రీరాముడికున్న విలువల్ని బండి సంజయ్ తగ్గించారని విమర్శించారు. బేషరతుగా పొన్నం ప్రభాకర్‌కు క్షమాపణలు చెప్పాలన్నారు. మీ అమ్మను ఒక మాట అంటే.. నీకు కోపం రాదా బండి సంజయ్? అని అడిగారు. ఓట్ల కోసమే రాముడిని వాడుకుంటున్నారని, రాముడికున్న గొప్ప చరిత్రను దిగజారుస్తున్నారని మండిపడ్డారు.