Share News

Jagityal District: పెద్దాపూర్‌ గురుకులంలో దిద్దుబాటు చర్యలు

ABN , Publish Date - Aug 11 , 2024 | 03:58 AM

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలోని పెద్దాపూర్‌ గురుకుల పాఠశాలలో ఎట్టకేలకు అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. 15 రోజుల వ్యవధిలో గురుకులంలో ఇద్దరు విద్యార్థులు అనుమానాస్పదంగా మృతి చెందడంతో ఉన్నతాధికారులు స్పందించారు.

Jagityal District: పెద్దాపూర్‌ గురుకులంలో దిద్దుబాటు చర్యలు

  • పిచ్చి మొక్కలు, ముళ్ల పొదల తొలగింపు

  • పనులు చేస్తుండగా బయటపడుతున్న పాములు

  • గురుకులాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్‌

మెట్‌పల్లి రూరల్‌, ఆగస్టు, 10: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలోని పెద్దాపూర్‌ గురుకుల పాఠశాలలో ఎట్టకేలకు అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. 15 రోజుల వ్యవధిలో గురుకులంలో ఇద్దరు విద్యార్థులు అనుమానాస్పదంగా మృతి చెందడంతో ఉన్నతాధికారులు స్పందించారు. శనివారం అదనపు కలెక్టర్‌ గౌతమ్‌ రెడ్డి పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని ఆదేశించడంతో పాఠశాలలోని శిఽథిలావస్థలో ఉన్న రేకుల షెడ్లు, భవనాలు, పాత కట్టడాలను కూల్చివేశారు.


తరగతి గదుల వెనుకవైపు ఉన్న పాడు బడ్డ బావులను పూడ్చి వేశారు. ప్రహరీ వెంట ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు, చెట్ల కొమ్మలు, ముళ్ల పొదలను తొలగించారు. పాఠశాల ఆవరణలో ఎక్స్‌కవేటర్‌తో పనులు చేస్తుండగా విషపూరిత పాములు సంచరిస్తుండడాన్ని గుర్తించారు. కాగా, అస్వస్థకు గురైన విద్యార్థులు మోక్షిత్‌, హేమంత్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని నిజామాబాద్‌ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

Updated Date - Aug 11 , 2024 | 03:58 AM