Hyderabad Fraud: హైదరాబాద్‌లో మరో భారీ మోసం.. ఉద్యోగాల పేరుతో శఠగోపం!
ABN , Publish Date - Jul 13 , 2024 | 01:32 PM
ఈమధ్య కాలంలో కొందరు దుండగులు నిరుద్యోగుల్ని టార్గెట్ చేసుకొని భారీ మోసాలకు పాల్పడుతున్నారు. మంచి జీతాలిచ్చే పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ శఠగోపం పెడుతున్నారు. వారిని నమ్మించేందుకు..
ఈమధ్య కాలంలో కొందరు దుండగులు నిరుద్యోగుల్ని టార్గెట్ చేసుకొని భారీ మోసాలకు పాల్పడుతున్నారు. మంచి జీతాలిచ్చే పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ శఠగోపం పెడుతున్నారు. వారిని నమ్మించేందుకు.. ఫేక్ కంపెనీలను సైతం సృష్టిస్తున్నారు. తీరా తమ చేతికి డబ్బులందాక.. బోర్డు తిప్పేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి మోసమే తాజాగా హైదరాబాద్‌లో (Hyderabad) వెలుగు చూసింది. ఉద్యోగాల పేరుతో యువత నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి, ఓ కన్సల్టెన్సీ సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
కొన్నాళ్ల క్రితం హైదరాబాద్‌లో జాగృతి కన్సల్టెన్సీ (Jagruthi Consultancy) పేరుతో ఒక ప్రైవేట్ కంపెనీ వెలిసింది. ఈ సంస్థకు ఆకుల జగదీశ్ అనే వ్యక్తి డైరెక్టర్. తమకు రూ.2 లక్షలు చెల్లిస్తే చాలు.. తామే ట్రైనింగ్ ఇప్పించి, మంచి జీతాలు ఇచ్చే సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆ కంపెనీ నమ్మించింది. ఆ ఆఫీస్ చూడ్డానికి ఎంతో ఎట్రాక్టివ్‌గా ఉండటం, కొందరు ఉద్యోగులు కూడా ఉండటం చూసి.. నిరుద్యోగులు ఎగబడ్డారు. వాళ్లు చెప్పినట్లేగానే రూ.2 లక్షలు ఇచ్చారు. ఇలా మొత్తం 1200 మంది నుంచి రూ.2 లక్షలు చొప్పున.. రూ. 24 కోట్ల వరకూ వసూలు చేసింది. అయితే.. రోజులు గడుస్తున్నా ఉద్యోగాలు ఇప్పించకపోవడం, ఆ సంస్థలో పని చేసే ఉద్యోగులగూ జీతాలు ఇవ్వకపోవడంతో.. అందరూ ప్రశ్నించడం మొదలుపెట్టారు.
Read Also: విగ్రహంతో పెళ్లి.. కారణం ఇదే!
కట్ చేస్తే.. ఇప్పుడు ఆ కంపెనీ బోర్డు తిప్పేసింది. అందులో పని చేసే ఉద్యోగులతో పాటు డబ్బులిచ్చిన నిరుద్యోగులు ఆ కంపెనీ వద్దకు వెళ్ల చూడగా.. దానికి తాళాలు వేసి ఉన్నాయి. దీంతో తాము మోసపోయామని గ్రహించి.. బాధితులు లబోదిబోమంటూ రోదిస్తున్నారు. పోలీసులను ఆశ్రయించి, తమకు న్యాయం చేయాలని కోరారు. దీంతో.. ఈ వ్యవహారంపై అధికారులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న జాగృతి కన్సల్టెంట్ డైరెక్టర్ జగదీశ్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో.. ఇలాంటి మోసపూరిత సంస్థల పట్ల జాగ్రత్తగా ఉండాలని, గుడ్డిగా డబ్బులు ఇవ్వొద్దని సూచిస్తున్నారు.
Read Latest Telangana News and Telugu News