Share News

JNTU: జేఎన్‌టీయూలో మరో ఫార్మసీ కళాశాల...

ABN , Publish Date - Jun 07 , 2024 | 11:34 AM

జేఎన్‌టీయూలో కొత్తగా ఫార్మసీ కళాశాల(Pharmacy College)ను ప్రారంభించేందుకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇన్‌చార్జ్‌ వైస్‌ చాన్స్‌లర్‌ బుర్రా వెంకటేశం ఆదేశాల మేరకు కొత్త ఫార్మసీ కళాశాల ఏర్పాటుకు సంబంధించిన ఫైలు వివిధ డైరెక్టరేట్ల మధ్య శరవేగంగా కదులుతోంది.

JNTU: జేఎన్‌టీయూలో మరో ఫార్మసీ కళాశాల...

- ఈ ఏడాది నుంచే ప్రారంభించాలని ఇన్‌చార్జ్‌ వీసీ ఆదేశం

- కౌన్సిల్‌ అనుమతులు లేకుండా సాధ్యం కాదంటున్న అధికారులు

హైదరాబాద్‌ సిటీ: జేఎన్‌టీయూలో కొత్తగా ఫార్మసీ కళాశాల(Pharmacy College)ను ప్రారంభించేందుకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇన్‌చార్జ్‌ వైస్‌ చాన్స్‌లర్‌ బుర్రా వెంకటేశం ఆదేశాల మేరకు కొత్త ఫార్మసీ కళాశాల ఏర్పాటుకు సంబంధించిన ఫైలు వివిధ డైరెక్టరేట్ల మధ్య శరవేగంగా కదులుతోంది. అయితే, కొత్త కళాశాల ఏర్పాటుకు అవసరమైన ఫార్మసీ కౌన్సిల్‌(Pharmacy Council) అనుమతులు గానీ, కోర్సును నిర్వహించేందుకు అవసరమైన బోధన, బోధనేతర సిబ్బంది లేకుండా ఇప్పటికిప్పుడు కాలేజీని ప్రారంభించ లేమంటూ యూనివర్సిటీ ప్రొఫెసర్ల నుంచి వాదనలు వినిపిస్తున్నాయి.

ఇదికూడా చదవండి: Congress: ఆ నియోజకవర్గంలో ‘కాంగ్రెస్’ బాగానే పుంజుకుందిగా..


ఇన్‌చార్జ్‌ వీసీకి దగ్గరి బంధువైన ఒక ప్రొఫెసర్‌ పోస్టింగ్‌లో భాగంగా సుల్తాన్‌పూర్‌కు వెళ్లకుండా.. హైదరాబాద్‌లోనే ఉండేందుకు ఏకంగా బీఫార్మసీ కళాశాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చినట్లు యూనివర్సిటీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బీఫార్మసీ కళాశాల ఏర్పాటు చేయాలని ఒక ప్రొఫెసర్‌ చేసిన ప్రతిపాదనకు ఇన్‌చార్జ్‌ వీసీ ఇంతవేగంగా స్పందించడం పట్ల వర్సిటీ అధికారులు, సిబ్బంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 07 , 2024 | 11:34 AM