Share News

Justice PC Ghosh: అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను

ABN , Publish Date - May 16 , 2024 | 04:21 AM

కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరమ్మతులు చేసి, వాటిని జూన్‌ 10 లోగా పునరుద్ధరించాలని జస్టిస్‌ పీసీ ఘోష్‌ అధికారులకు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజీలు దెబ్బతినడం, అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై జస్టిస్‌ ఘోష్‌ నేతృత్వంలో న్యాయ విచారణ జరుగుతన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల రాష్ట్రంలో పర్యటించారు. అనంతరం నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎ్‌సఏ)కి లేఖ రాశారు. ఆయన లేఖతో.. బ్యారేజీల పునరుద్ధరణకు తీసుకునే చర్యలపై ఎన్‌డీఎ్‌సఏ మధ్యంతర నివేదిక ఇచ్చింది.

Justice PC Ghosh: అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను

  • జూన్‌ 10లోగా పునరుద్ధరించండి

  • కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులకు జస్టిస్‌ పీసీ ఘోష్‌ సూచన

హైదరాబాద్‌, మే 15 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరమ్మతులు చేసి, వాటిని జూన్‌ 10 లోగా పునరుద్ధరించాలని జస్టిస్‌ పీసీ ఘోష్‌ అధికారులకు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజీలు దెబ్బతినడం, అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై జస్టిస్‌ ఘోష్‌ నేతృత్వంలో న్యాయ విచారణ జరుగుతన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల రాష్ట్రంలో పర్యటించారు. అనంతరం నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎ్‌సఏ)కి లేఖ రాశారు. ఆయన లేఖతో.. బ్యారేజీల పునరుద్ధరణకు తీసుకునే చర్యలపై ఎన్‌డీఎ్‌సఏ మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను పరిశీలించిన జస్టిస్‌ ఘోష్‌.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరమ్మతులు, పునరుద్ధరణ పనులు జూన్‌ 10కల్లా పూర్తికావాలని తాజాగా అధికారులకు సూచించారు. మేడిగడ్డ బ్యారేజీ మరింత దెబ్బతినకుండా నష్టనివారణ చర్యలు తీసుకోవాలన్నారు.


ఘోష్‌ సూచనలతో పాటు ఎన్‌డీఎ్‌సఏ మధ్యంతర నివేదికతో మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న గేట్లను ఎత్తడం లేదా, 10 రోజుల్లోగా పూర్తిగా తొలగించాలని నిర్మాణ సంస్థ ‘ఎల్‌ అండ్‌ టీ’ని నీటిపారుదలశాఖ అధికారులు ఇప్పటికే ఆదేశించారు. ఏటా జూన్‌లో మేడిగడ్డకు వరదలు ప్రారంభమై ఫిబ్రవరి దాకా కొనసాగుతాయి. దీంతో ఈసారి వరదలు తగ్గుముఖం పట్టాక బ్యారేజీ పైన షీట్‌ఫైల్స్‌తో కాఫర్‌ డ్యామ్‌ను కట్టనున్నారు. మరోవైపు, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో పునాది కింద రంధ్రాలున్నట్లు గుర్తించారు. పునాది కింద ఇసుక కొట్టుకుపోవడంతో రంధ్రాలు ఏర్పడినట్లు తేల్చారు. వాటిని వానాకాలం వచ్చేలోపు సరిచేయనున్నారు. ఇదిలా ఉండగా, మేడిగడ్డ బ్యారేజీకి ఇప్పటికే పలు సాంకేతిక పరీక్షలు నిర్వహించారు. మరికొన్ని నిర్వహించాల్సి ఉంది. ఆ పరీక్షల నివేదిక పరిశీలన తర్వాత 7వ బ్లాకును తొలగించాలా.. ఆ బ్లాకు కుంగిన ప్రభావం 6, 8వ బ్లాకులపై పడిందా.. ఒకవేళ ప్రభావం చూపితే మొత్తం మూడు బ్లాకులు తొలగించి, కొత్త బ్లాకులు కట్టాలా.. అన్నదానిపై నిర్ణయం తీసుకోనున్నారు.

Updated Date - May 16 , 2024 | 04:21 AM