Share News

రేపటి దాకా పీజీ మెడికల్‌ ప్రవేశాలకు వెబ్‌ ఆప్షన్లు

ABN , Publish Date - Dec 30 , 2024 | 04:37 AM

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యవిద్య కళాశాలలతోపాటు నిమ్స్‌లోని పీజీ వైద్య సీట్ల భర్తీకి ఈ నెల 29 నుంచి 31వరకు మొదటి విడత వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్టు కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ ప్రకటించింది.

రేపటి దాకా పీజీ మెడికల్‌ ప్రవేశాలకు వెబ్‌ ఆప్షన్లు

హైదరాబాద్‌, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యవిద్య కళాశాలలతోపాటు నిమ్స్‌లోని పీజీ వైద్య సీట్ల భర్తీకి ఈ నెల 29 నుంచి 31వరకు మొదటి విడత వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్టు కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ ప్రకటించింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ముగియడంతో మొదటి విడత వెబ్‌ ఆప్షన్లకు వర్సిటీ ఆదివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈనెల 31వ తేదీ రాత్రి 8 గంటల వరకు మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలని వర్సిటీ తెలిపింది.


మెరిట్‌ జాబితా, కళాశాలల వారీగా ఖాళీ సీట్ల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. మెడికోలకు కేటాయించే సీట్లు సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని పేర్కొంది. 3,315 మంది అభ్యర్థుల ప్రొవిజనల్‌ తుది అర్హుల జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచింది.

Updated Date - Dec 30 , 2024 | 04:37 AM