Share News

B.Sc Nursing: బీఎస్సీ నర్సింగ్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

ABN , Publish Date - Oct 06 , 2024 | 03:23 AM

నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ శనివారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

B.Sc Nursing: బీఎస్సీ నర్సింగ్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

హైదరాబాద్‌, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ శనివారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు నర్సింగ్‌ కాలేజీల్లోని కన్వీనర్‌ కోటా సీట్ల కోసం ఈ నెల 6 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. దరఖాస్తులకు అక్టోబరు 14న సాయంత్రం 6 గంటల వరకు అవకాశం కల్పించింది.


వరుసగా నాలుగేళ్ల పాటు తెలంగాణలో చదివిన వారే అర్హులని పేర్కొంది. అభ్యర్థులు తెలంగాణ ఇంజనీరింగ్‌ అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలని తెలిపింది. జనరల్‌ అభ్యర్థులు 50ు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 40ు, దివ్యాంగులకు 45ు కటా్‌ఫగా నిర్ణయించింది. వివరాలకు హెల్త్‌ యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరింది.

Updated Date - Oct 06 , 2024 | 03:23 AM