Share News

Delhi Liquor Case: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కవిత.. రేపు విచారణ

ABN , Publish Date - May 09 , 2024 | 08:59 PM

డిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీహాడ్ జైల్లో ఉన్నారు. ఆ క్రమంలో బెయిల్ కోసం ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది.

Delhi Liquor Case: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కవిత.. రేపు విచారణ

న్యూఢిల్లీ, మే 09: డిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీహాడ్ జైల్లో ఉన్నారు. ఆ క్రమంలో బెయిల్ కోసం ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టును ఆమె ఆశ్రయించారు. అందులోభాగంగా గురువారం ఆమె న్యాయవాదులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో కవిత బెయిల్ పిటిషన్‌పై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది.

AP Elections 2024: కర్నూలు ‘సిటీ’ని ఏలేదెవరు..?

లిక్కర్ స్కామ్‌లో కవితకు శిక్ష పడే అవకాశం ఉందనే ఓ చర్చ జరుగుతుంది. దీంతో ఆమెకు బెయిల్ ఇవ్వాలని రౌస్ అవెన్యు కోర్టుకు ఆమె తరఫు న్యాయవాదులు విన్నవించారు. కానీ ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లలో ఆమె ఒకరని కోర్టుకు న్యాయవాదులు తెలియజేశారు.

AP Assembly Elections: ఎమ్మిగనూరులో గెలుపు ఎవరిది..?


ఈ అంశాన్ని సైతం పరిగణలోకి తీసుకోవాలని కోర్టును వారు కోరారు. అంతేకాకుండా మహిళగా పీఎంఎల్ఏ సెక్షన్- 45 ప్రకారం బెయిల్ పొందే అర్హత ఆమెకు ఉందని కోర్టుకు వివరించారు. కానీ కవితకు బెయిల్ ఇచ్చేందుకు సదరు కోర్టు నిరాకరించింది. దీంతో కవిత బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

Hardeep Singh Nijjar: కెనడా వైఖరిపై స్పందించిన విదేశాంగ శాఖ

ఈ ఏడాది మార్చి 15వ తేదీన ఢిల్లీ మద్యం కేసులో ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు. నాటి నుంచి ఆమె తీహాడ్ జైలులోనే ఉన్నారు. ఇక ఏప్రిల్ 11వ తేదీ సీబీఐ అధికారులు కవితను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అటు ఈడీ, ఇటు సీబీఐ కేసుల్లో కవితకు మాత్రం బెయిల్ దొరకడం లేదు.

Delhi Liquor Policy Case: కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్.. వ్యతిరేకించిన ఈడీ

Read Latest National News And Telugu News

Updated Date - May 09 , 2024 | 09:00 PM