ABN Interview: మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే బీఆర్ఎస్ కనుమరుగు.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Oct 26 , 2024 | 03:49 PM
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని అడ్డుకుంటే ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం ఖాయమని కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు.
యాదాద్రి: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని అడ్డుకుంటే ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం ఖాయమని కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. శనివారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. మూసీ నదిలో కలిసే వ్యర్థాలు, కలుషితాలతో పరివాహక ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని అన్నారు. 'పదేళ్లుగా అధికారంలో ఉండి బీఆర్ఎస్ మూసీ ప్రక్షాళన ఎందుకు చేయలేదు. మూసీ పరివాహక ప్రాంతాల్లో పండే పంటలు విషతుల్యంగా మారాయి. మురికితో కుల వృత్తులు దెబ్బతిన్నాయి. ఎన్జీటీ ప్రశ్నించాకే మాజీ మంత్రి కేటీఆర్.. ఎస్టీపీ ప్లాంట్ పెట్టారు.
మా చిన్నతనంలో మూసీలో ఈత కొట్టేవాళ్ళం. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఒక్క నకిరేకల్ నియోజకవర్గంలోనే మూసీలోని నీటితో 80 శాతం పంటలు సాగవుతున్నాయి. సీఎం రేవంత్ గొప్ప ప్రయత్నాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మూసీ ప్రక్షాళన అడ్డుకుంటే భవిష్యత్‌లో హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో బీఆర్ఎస్ కనుమరుగవడం ఖాయం. కేటీఆర్ ఎస్టీపీ ప్లాంట్ పెడితే పిల్లాయిపల్లికి మూసీలో మురుగు నీరు ఎలా వచ్చింది. ఎస్టీపీ ప్లాంట్‌తో నీరు శుద్ధి చేస్తే ఆ నీటిని తాగాలని కేటీఆర్‌కు సవాల్ విసురుతున్నా. నల్గొండ జిల్లాకు బీఆర్ఎస్ చేసింది శూన్యం" అని ఎమ్మెల్యే వేముల వీరేశం విమర్శించారు.
సీయోల్ నగరంలా అభివృద్ధి..
మూసీ ప్రక్షాళన చేయాలన్న కాంగ్రెస్ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకించడం తగదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అడ్డుపడటం సరికాదన్నారు. 'సీయోల్ నగరంలా మూసీ నది పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. ప్రజా సంక్షేమం కోసం రాజకీయాలు పక్కన పెట్టి అందరూ కలిసి రావాలి" అని చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు.
ఆగేదే లేదు..
బీఆర్‌ఎస్ మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావులే కాదు వారి తాతలు దిగొచ్చి, అడ్డుపడినా మూసీ ప్రక్షాళన ఆగదని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళన చేయాలన్న డిమాండ్‌తో యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరు మండలం మానాయకుంట- గురిజాల మధ్య ఉన్న మూసీ బ్రిడ్జి వద్ద ఈ నెల 27న నిర్వహించే బహిరంగ సభకు స్థలాన్ని శుక్రవారం పరిశీలించి, విలేకరులతో మాట్లాడారు. తన చిన్నతనంలో మూసీ నీటిని తాగేవారమన్నారు. అలాంటి నీరు ఇప్పుడు కలుషితమై, ఆ నీటితో పండించిన పంటలు తినలేని దుస్థితి ఏర్పడిందన్నారు. మూసీ ప్రక్షాళన వద్దనే బీఆర్‌ఎస్ నాయకులు వారి ప్రభుత్వంలో మూసీ ప్రక్షాళనకు రూ.25వేల కోట్లు కేటాయించి, మూసీ రివర్ ప్రాజెక్టును ఏర్పాటుచేసి దానికి సుధీర్‌రెడ్డి చైర్మనగా ఎందుకు చేశారని ప్రశ్నించారు.
ఇవి కూడాచదవండి..
TG Police: పోలీసు, పొలిటికల్ వర్గాల్లో సంచలనంగా మారిన అజ్ఞాత వ్యక్తి లేఖ..
Jaggareddy: అవును.. వాళ్లను తిట్టాను.. తప్పేంటి
Read Latest Telangana News And Telugu News