Share News

Kavitha: ‘బయ్యారం’ కోసం బీజెపీ ఎంపీలు పోరాడాలి

ABN , Publish Date - Dec 13 , 2024 | 04:49 AM

తెలంగాణలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాదంటూ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి చేసిన ప్రకటనపై బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్వీ కల్వకుంట కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Kavitha: ‘బయ్యారం’ కోసం బీజెపీ ఎంపీలు పోరాడాలి

  • ఉక్కు పరిశ్రమపై కిషన్‌రెడ్డి ప్రకటన బాధాకరం: కవిత

హైదరాబాద్‌, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి) : తెలంగాణలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాదంటూ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి చేసిన ప్రకటనపై బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్వీ కల్వకుంట కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కిషన్‌ రెడ్డి ప్రకటన బాధాకరమని అన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు బీజేపీ ఎంపీలు పోరాడాలని డిమాండ్‌ చేస్తూ గురువారం ఓ ప్రకటన చేశారు.


నాణ్యమైన ముడి ఇనుము లభించదనే సాకుతో బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాదని చెప్పి కేంద్ర ప్రభుత్వం తప్పించుకోవడాన్ని కవిత విమర్శించారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ హామీ కాదని విభజన చట్టంలోని అంశమని గుర్తు చేశారు. కాగా, మహిళలకు కాంగ్రెస్‌ నాయకులు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌ డిమాండ్‌చేశారు. బతుకమ్మ చీరలు అడిగితే అసలు బతుకమ్మే లేదన్నట్లుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Dec 13 , 2024 | 04:49 AM