KCR: దశాబ్ది వేడుకలను రాను.. రేవంత్‌కు కేసీఆర్ బహిరంగ లేఖ..
ABN , Publish Date - Jun 01 , 2024 | 06:31 PM
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు(KCR)ను కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే ఈ వేడుకలకు తాను హాజరుకాబోవడం లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. అందుకుగల కారణాలను పేర్కొంటూ సీఎం రేవంత్ రెడ్డికి శనివారం బహిరంగ లేఖ రాశారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు(KCR)ను కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే ఈ వేడుకలకు తాను హాజరుకాబోవడం లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. అందుకుగల కారణాలను పేర్కొంటూ సీఎం రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) శనివారం బహిరంగ లేఖ రాశారు.
అమరుల చావులకు కారణమైన కాంగ్రెస్ పార్టీ(Congress).. ప్రస్తుతం వారి పేరు చెబుతూ రాజకీయాలు చేస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రను ప్రజలు మరువరని అన్నారు. రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ పాత్రను కాంగ్రెస్ సర్కార్ తక్కువ చేసి చూపుతోందని.. ఇది రాష్ట్ర సాధకుడైన తనకు అవమానమని.. అందుకే వేడుకలకు హాజరుకావట్లేదని వెల్లడించారు.
"ప్రభుత్వం పక్షాన మీరు నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు రమ్మని మీరు నాకు ఆహ్వానం పంపిన నేపథ్యంలో ప్రజల పక్షాన నేను మీకు ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర అవతరణ సుదీర్ఘ ప్రజా పోరాట ఫలితమనీ, అమరుల త్యాగాల పర్యవసానమనీ కాకుండా, కాంగ్రెస్ దయాభిక్షగా ప్రచారం చేస్తున్న మీ భావ దారిద్ర్యాన్ని నేను మొట్టమొదట నిరసిస్తున్నాను. 1969 నుండీ ఐదు దశాబ్దాలు, భిన్నదశలలో, భిన్న మార్గాలలో ఉద్యమ ప్రస్థానం సాగింది. చరిత్ర పొడుగునా తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ రక్తసిక్తం చేసిందనేది మీరు దాచేస్తే దాగని సత్యం. బీఆర్ఎస్ పార్టీ పాత్ర ఏంటో ప్రజలకు తెలుసు. ప్రజా పాలన అని చెబుతూ ఒక్క హామీ నెరవేర్చకుండా పబ్బం గడుపుతున్నారు. ముందు వాటిని నెరవేర్చండి" అంటూ కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు.
Read Latest Telangana News and National News