Hyderabad: కాళోజీ బతుకంతా తెలంగాణ కోసమే: కేసీఆర్
ABN , Publish Date - Sep 09 , 2024 | 03:38 AM
ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఆయన సేవలను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు.
హైదరాబాద్, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఆయన సేవలను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు. ప్రజాపక్షాన నిలిచి ధిక్కారమే జీవితంగా స్ఫూర్తివంతమైన జీవితాన్ని గడిపిన మానవతావాది కాళోజీ అని కొనియాడారు. కాళోజీ జయంతి సందర్భంగా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
బతుకంతా తెలంగాణ కోసమే అర్పించిన అక్షర తపస్వి కాళోజీ అంటూ కేసీఆర్ కీర్తించారు. తెలంగాణ సాధన కోసం తాను బయలుదేరిన నాడు నిండు మనసుతో కాళోజీ దీవించారని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. కాళోజీ స్ఫూర్తి కొనసాగే దిశగా ఆయన జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించిందన్నారు.