Hyderabad: జానీ మాస్టర్ లైంగిక వేధింపులు నిజమే
ABN , Publish Date - Dec 26 , 2024 | 05:30 AM
సినీ నృత్య దర్శకుడు జానీ మాస్టర్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. అతను తన వద్ద పనిచేసిన సహాయ నృత్య దర్శకురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులు నిర్ధారించారు.
చార్జిషీట్ దాఖలు చేసిన నార్సింగ్ పోలీసులు
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): సినీ నృత్య దర్శకుడు జానీ మాస్టర్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. అతను తన వద్ద పనిచేసిన సహాయ నృత్య దర్శకురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు చార్జిషీట్ దాఖలు చేశారు. జానీ మాస్టర్ ఆమెను ఈవెంట్ల పేరుతో పలు ప్రాంతాలకు తీసుకువెళ్లి లైంగిక వేఽధింపులకు పాల్పడ్డాడని దర్యాప్తులో గుర్తించిన పోలీసులు ఇదే విషయాన్ని చార్జిషీట్‌లో పేర్కొన్నారు.
బాధిత యువతి సెప్టెంబరు 15న పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈవెంట్ పేరుతో ముంబైకి తీసుకెళ్లిన జానీ మాస్టర్ హోటల్ రూములో తనపై లైంగిక దాడి చేశాడని, షూటింగ్ సమయంలో పలుమార్లు లైంగికంగా వేధించాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో అక్టోబరు 25న విడుదలయ్యాడు.