Share News

Cotton Market: ఖమ్మం మార్కెట్‌కు పోటెత్తిన పత్తి

ABN , Publish Date - Oct 29 , 2024 | 03:58 AM

భారీ ఎత్తున పోటెత్తిన తెల్ల బంగారం (పత్తి)తో ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ కళకళలాడింది.

Cotton Market: ఖమ్మం మార్కెట్‌కు పోటెత్తిన పత్తి

  • ఈ సీజన్‌లో తొలిసారి 40 వేల బస్తాల రాక

ఖమ్మం మార్కెట్‌ , అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): భారీ ఎత్తున పోటెత్తిన తెల్ల బంగారం (పత్తి)తో ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ కళకళలాడింది. సోమవారం మార్కెట్‌కు సుమారు 40 వేల పత్తి బస్తాలు అమ్మకానికి వచ్చాయి. కొత్త పత్తి సీజన్‌లో మార్కెట్‌కు ఇంత భారీగా పంట రావడం ఇదే ప్రఽథమం. మార్కెట్‌కు శని, ఆదివారాలు వరుసగా రెండు రోజులు సెలవులు కావడంతో సోమవారం రైతులు భారీగా తమ పంటను మార్కెట్‌కు తెచ్చారు.


మార్కెట్‌కు గత కొద్ది రోజులుగా రోజుకు 8 నుంచి 10 వేల బస్తాల పత్తి వస్తుండగా సోమవారం ఒక్కసారిగా 40 వేల బస్తాలకు పైగా అమ్మకానికి రావడం విశేషం. కాగా, మార్కెట్‌లో క్వింటాలు పత్తిని నాణ్యతను బట్టి గరిష్టంగా రూ.6,800లకు, కనిష్టంగా రూ.5,900లు కొనుగోలు చేస్తున్నారు. నమూనా రకాలను రూ.6,600 ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ ధరకు వ్యాపారులు కొనుగోలు చేశారు.

Updated Date - Oct 29 , 2024 | 03:58 AM