Share News

Khammam: వంటనూనెలు సలసల.. వామ్మో ఇలా ఉంటే ఎలా కొనేది..

ABN , Publish Date - Nov 08 , 2024 | 12:58 PM

వంటనూనెల ధరలు మంటలు మండి పోతున్నాయి. రోజు రోజుకు ధరలు పెరుగుతూ వినియోగదారులకు దడ పుట్టిస్తున్నాయి. పండుగలు, శుభకార్యాల వేళ వంట నూనెల ధరలకు రెక్కలు రావడంతో సామాన్యులు విలవిలలాడుతున్నారు. గత నెల క్రితం లీటరు పామాయిల్‌ రూ.90లు నుంచి రూ.95లకు, సన్‌ప్లవర్‌ ఆయిల్‌(Sunflower oil) రూ. 110-115 లకు ఉండగా ప్రసుత్తం పామాయిల్‌ రిటైల్‌ మార్కెట్‌లో లీటర్‌ రూ. 135లకు, సన్‌ప్లవర్‌ రూ.145 లకు చేరింది.

Khammam: వంటనూనెలు సలసల.. వామ్మో ఇలా ఉంటే ఎలా కొనేది..

- భారీగా పెరిగిన ధరలు

- నెల రోజుల్లోనే లీటరుపై రూ. 40 నుంచి రూ. 50 వరకు పెరుగుదల

- దిగుమతి సుంకం పెంచడంతోనే ధరలు హైక్‌

- బెంబేలెత్తుతున్న వినియోగదారులు

ఖమ్మం: వంటనూనెల ధరలు మంటలు మండి పోతున్నాయి. రోజు రోజుకు ధరలు పెరుగుతూ వినియోగదారులకు దడ పుట్టిస్తున్నాయి. పండుగలు, శుభకార్యాల వేళ వంట నూనెల ధరలకు రెక్కలు రావడంతో సామాన్యులు విలవిలలాడుతున్నారు. గత నెల క్రితం లీటరు పామాయిల్‌ రూ.90లు నుంచి రూ.95లకు, సన్‌ప్లవర్‌ ఆయిల్‌(Sunflower oil) రూ. 110-115 లకు ఉండగా ప్రసుత్తం పామాయిల్‌ రిటైల్‌ మార్కెట్‌లో లీటర్‌ రూ. 135లకు, సన్‌ప్లవర్‌ రూ.145 లకు చేరింది. అంతేకాకుండా మన దేశీయ అవసరాలకు పామాయిల్‌, సన్‌ప్లవర్‌ నూనెలను ఎక్కువ మొత్తంలో దిగుమతి చేసుకుంటున్న సంగతి విదితమే.

ఈ వార్తను కూడా చదవండి: Cyber ​​criminals: లింక్‌ పంపి రూ.1.45 లక్షలు దోచేశారుగా..


ఈ క్రమంలో దేశీయంగా పామాయిల్‌ ధరలు, సాగు పెంచేందుకు గాను ఇటీవల కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని ఒకేసారి 20 శాతం పెంచింది. దీంతో ఒక్క సారిగా వంట నూనెల ధరలు భగ్గుమన్నాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో వేరుశనగ నూనె లీటర్‌ ధర రూ. 150 నుంచి రూ. 160 ల వరకు, రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ లీటర్‌ రూ.150ల నుంచి రూ.160ల వరకు, మస్టర్డ్‌ ఆయిల్‌ (ఆవనూనె) రూ.200 ల నుంచి రూ. 210 ల వరకు, పూజలకు ఉపయోగించే దీపారాదన నువ్వుల నూనె సైతం లీటర్‌ రూ.150ల వరకు పెరిగాయి.


kmmp2.jpg

అంతే కాకుండా 15 లీటర్ల సన్‌ప్లవర్‌ ఆయిల్‌ టిన్‌ ధర గత నెలలో రూ. 1,750 లు కాగా ప్రస్తుతం రూ. 2,250 లకు చేరింది. ప్రాంతాలను బట్టి రిటైల్‌ మార్కెట్‌లో లీటర్‌కు మరో రూ.5 లు అధనంగా భారం పడుతుండటంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ప్రస్తుతం పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో నూనెలపై ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు భయపడుతున్నారు.


డిమాండ్‌కు అనుగుణంగా మన దేశీయ అవసరాలకు ఇతర దేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకోవడంతో ధరల పెరుగుదల నమోదవుతుందని వ్యాపారులు పేర్కోంటున్నారు. మన దేశంలో వంట నూనె గింజల ఉత్పతి కేవలం 5 శాతమేనని, విదేశాలనుంచి దిగుమతి మిగితా 95 శాతం దిగుమతి ఉండటంతో పాటు దిగుమతి సుంకాలు, లోకల్‌ రవాణా చార్జీలు, జీఎస్టీ, వ్యాపారుల కమీషన్‌, రిటైలర్‌ లాభాల మార్జిన్‌లు అధనంగా ఉండటంతో ధరలు పెరుగుదలకు కారణాలని వ్యాపారులు పేర్కొంటున్నారు.


నూనె గింజలు, పామాయిల్‌ పంటల సాగును సబ్సిడీతో ప్రోత్సహించాలి

- నున్నా సత్యనారాయణ, నగర ఆయిల్‌ మిల్లర్స్‌ సంఘం అధ్యక్షుడు

మన దేశం 95 శాతం వంట నూనెలను విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. కారణం మనదేశంలో రైతులు నూనె గింజలను పండించకుండా పత్తి, మిర్చి, మొక్కజొన్న తదితర వాణిజ్య పంటలను మాత్రమే పండిస్తున్నారు. నూనె గింజలకు మధ్ధతు ధర ఎక్కువగా నిర్ణయించి, రైతులకు విత్తనాలను, ఎరువులను సబ్సీడీపై అందించి నూనె గింజలు, పామాయిల్‌ సాగును ప్రోత్సహిస్తే ధరలు ఇక్కడ తగ్గే అవకాశం ఉంటుంది. లేకపోతే నూనెల ధరలను నియంత్రించ లేము. నూనెలను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నంత కాలం పరిస్థితి ఇలానే ఉంటుంది. ప్రభుత్వాలు ఇకనైనా నూనె గింజల సాగుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించాలి.


ఈవార్తను కూడా చదవండి: పశ్చిమ బెంగాల్‌ నుంచి నగరానికి హెరాయిన్‌.. ఐటీ కారిడార్‌లో విక్రయం

ఈవార్తను కూడా చదవండి: నీళ్ల బకెట్లో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి

ఈవార్తను కూడా చదవండి: కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు దివాలా: కిషన్‌రెడ్డి

ఈవార్తను కూడా చదవండి: వద్దొద్దంటున్నా.. మళ్లీ ఆర్‌ఎంసీ!

Read Latest Telangana News and National News

Updated Date - Nov 08 , 2024 | 12:58 PM