Share News

Ponguleti: రాష్ట్ర వ్యాప్తంగా 28 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు శంకుస్థాపన: మంత్రి పొంగులేటి

ABN , Publish Date - Oct 11 , 2024 | 12:30 PM

గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమిలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు 10 వేల 6 పోస్టులు డీఎస్సీ ద్వారా ఇచ్చామని చెప్పారు. ఉపాధ్యాయుల బదిలీలతో పాటు ఉద్యోగఉన్నతి ఇందిరమ్మ ప్రభుత్వం కలిపించిందని, గత ప్రభుత్వం అనేక స్కూల్స్ పెట్టిందే తప్ప పక్క వసతి కలిపించడంలో విఫలమైందని ఆరోపించారు.

Ponguleti:  రాష్ట్ర వ్యాప్తంగా 28 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు శంకుస్థాపన: మంత్రి పొంగులేటి

ఖమ్మం జిల్లా; తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 28 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ (28 integrated schools) కు శంకుస్థాపన (Foundation ) చేసుకుంటున్నామని, పేదల పట్ల ప్రభుత్వం చిత్తశుద్దతో పనిచేస్తోందని, విద్య వైద్యానికి ఇందిరమ్మ ప్రభుత్వం (Indiramma Govt.,) పెద్దపీట వేసిందని రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మం రూరల్ మండలం, పొన్నెకల్‌లో నూతనంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం అమ్మ ఆదర్శ పథకంతో రూ. 657 కోట్లతో ప్రభుత్వం వచ్చిన మూడునెల్లోనే చేపట్టి సౌకర్యాలు కల్పించిందని చెప్పారు.

గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమిలేదని మంత్రి పొంగులేసి విమర్శించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు 10 వేల 6 పోస్టులు డీఎస్సీ ద్వారా ఇచ్చామని చెప్పారు. ఉపాధ్యాయుల బదిలీలతో పాటు ఉద్యోగ ఉన్నతి ఇందిరమ్మ ప్రభుత్వం కల్పించిందని, గత ప్రభుత్వం అనేక స్కూల్స్ పెట్టిందే తప్ప పక్క వసతి కల్పించడంలో విఫలమైందని ఆరోపించారు. అంతర్జాతీయ స్టా అండ్ తో ఇందిరమ్మ ప్రభుత్వం కులమతాలకు అతీతంగా ఇంటిగ్రేటెడ్ స్కూలకు శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో 125 నుంచి 150 కోట్లతో అద్భుతమైన స్కూల్ ఈ ప్రభుత్వం నిర్మాణం చేయబోతోందని అన్నారు. గత ప్రభుత్వం రాష్టాన్ని అప్పుల పాలు చేసి ప్రజల నెత్తిన భారం మోపిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రూ. 300 కోట్లతో అనేక కంపెనీలతో స్కిల్ డవలప్ మెంట్ నైపుణ్యం పెంపొందించే అవకాశం కలిపించిందన్నారు. మాటలతో కాదు ఇందిరమ్మ ప్రభుత్వం చేతలతో చేసి చూపిస్తుందని.. ప్రవేటుకు దీటుగా పేద విద్యలకు కార్పొరేట్ విద్యానందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో కూడిన విద్యను అందించాలన్న లక్ష్యంతో సమీకృత గురుకులాల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలి దశలో 28 నియోజకవర్గాల్లో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ను తీసుకురావాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న గురుకులాలను కొనసాగిస్తూనే.. అత్యాధునిక వసతులతో సమీకృత భవనాలను నిర్మించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు గురువారం ఆయా నియోజకవర్గాలతో కూడిన జాబితాను విడుదల చేయడంతోపాటు సంబంధిత ఉత్తర్వులను జారీ చేసింది. కొడంగల్‌, మధిర, హుస్నాబాద్‌, నల్లగొండ, హుజూర్‌నగర్‌, మంథని, ములుగు, పాలేరు, ఖమ్మం, వరంగల్‌, కొల్లాపూర్‌, ఆంధోల్‌, చాంద్రాయణగుట్ట, మంచిర్యాల, భూపాలపల్లి, అచ్చంపేట, స్టేషన్‌ ఘన్‌పూర్‌, తుంగతుర్తి, మునుగోడు, చెన్నూరు, షాద్‌నగర్‌, జడ్చర్ల, పరకాల, నారాయణఖేడ్‌, దేవరకద్ర, నాగర్‌కర్నూలు, మానకొండూరు, నర్సంపేటలో సమీకృత భవనాలను నిర్మించనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.

కాగా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌కు శుక్రవారం సీఎం రేవంత్‌ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం.2 గంటలకు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లోని కొందుర్గులో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఇందుకోసం కొందుర్గు శివారులోని సర్వే నంబర్ 109లో 20 ఎకరాలు కేటాయించారు. సీఎం రాక నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శశాంక, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పనులను పర్యవేక్షించారు.

నూతన భవనాల్లో సకల సౌకర్యాలు

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని లక్ష్మీపురం వద్ద నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ మోడల్‌ను ఇప్పటికే ఖరారు చేశారు. సుమారుగా 20 ఎకరాల్లో అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌, తరగతి గదులు, ప్రయోగశాలలు, ఆట స్థలం, బాలబాలికలకు వేర్వేరు హాస్టళ్లు, టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌ సిబ్బందికి నివాస సముదాయాలు ఏర్పాటు చేసేలా నమూనా రూపొందించారు. తరగతి గదుల్లో డిజిటల్‌ బోర్డులు, కంప్యూటర్‌ ల్యాబ్‌లు, క్రీడా మైదానాలు, యాంప్‌ థియేటర్‌ వంటి అధునాత సౌకర్యాలు కల్పిస్తారు.

రెండు అంతస్తుల్లో క్లాస్‌ రూమ్‌లు, మూడు అంతస్తుల్లో బాలబాలికలకు వేర్వేరు హాస్టళ్లు, 5 అంతస్తుల్లో సిబ్బందికి వసతి సౌకర్యాలు.. ఇలా వేర్వేరు బ్లాక్‌లు ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థుల మానసిక ఉల్లాసం కోసం క్రికెట్‌ గ్రౌండ్‌, ఫుట్‌బాల్‌ కోర్టు, బాస్కెట్‌బాల్‌, వాలీబాల్‌, టెన్నిస్‌ కోర్టులతోపాటు ఔట్‌డోర్‌ జిమ్‌, ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో గురుకులంలో 2,560మంది విద్యార్థులు ఉండేలా నిర్మాణాలు చేపట్టనున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసే లైబ్రరీలో 5వేల పుస్తకాలను అందుబాటులో ఉంచనున్నారు. 900 మంది ఒకేసారి కూర్చుని భోజనం చేసేలా డైనింగ్‌ హాల్‌ను నిర్మించనున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

జాయ్ జమీమా దారుణాలు.. వెలుగులోకి వస్తున్న నిజాలు..

సిద్ధిదాయిని అలంకారంలో శ్రీభ్రమరాంబికాదేవి

విజయవాడ: మహిషాసురమర్ధినిగా అమ్మవారి దర్శనం..

ఎనిమిదవ రోజుకు చేరుకున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 11 , 2024 | 12:30 PM