TS Politics: కాంగ్రెస్ మార్పు అంటే ఇదేనేమో.. హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Feb 03 , 2024 | 06:51 PM
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఇచ్చిన హామీలను నెరవేర్చేలా పోరాడుతామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) అన్నారు. శనివారం నాడు మణుగూరులో మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఇచ్చిన హామీలను నెరవేర్చేలా పోరాడుతామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) అన్నారు. శనివారం నాడు మణుగూరులో మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... జిల్లాకు మెడికల్ కాలేజీ ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలు శ్రమించి మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాన్ని గెలిపించుకోవాలని కోరారు. మహబూబాద్ పార్లమెంట్ స్థానాన్ని మూడోసారి గెలుచుకొని హ్యాట్రిక్ సాధించాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే అంత అప్పు చేసింది
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేక చర్చ మొదలైందన్నారు. సీఎం రేవంత్ మార్క్ పాలన అంటే.. కరెంటు పోవడం, రుణమాఫీ చేయకపోవడం, రైతుబంధు పడకపోవడం, ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకపోవడం ఇదే తన మార్పు అని తెలిపారు. ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని.. వారికి నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లక్షన్నర ఎకరాలకు పొడు భూములకు పట్టాలిచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు ఇచ్చిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 14 వేల కోట్ల అప్పు చేసి రైతుబంధు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. బీఆర్ఎస్‌ది పాలకపక్షమైన.. ప్రతిపక్షమైన ప్రజల పక్షమేనని హరీశ్‌రావు అన్నారు.