Share News

Rain Alert.. ఖమ్మం జిల్లా: వాగులో కొట్టుకుపోయి యువకుడి మృతి

ABN , Publish Date - Sep 01 , 2024 | 10:12 AM

ఖమ్మం: జిల్లాలో రెండ్రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం రాత్రంతా వదలకుండా వాన పడడంతో జనజీవనం స్తంభించింది. వరద భారీగా చేరడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చాలాచోట్ల చెరువులు, కుంటలు అలుగుపోస్తున్నాయి. తిరుమలాయపాలెం మండలంలోని రాకాసి తండాను ఆకేరు వరద ప్రవాహం చుట్టుముట్టింది.

Rain Alert.. ఖమ్మం జిల్లా:  వాగులో కొట్టుకుపోయి యువకుడి మృతి

ఖమ్మం: జిల్లాలో రెండ్రోజులుగా భారీ వర్షం (Heavy Rains) కురుస్తోంది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం రాత్రంతా వదలకుండా వాన పడడంతో జనజీవనం స్తంభించింది. వరద భారీగా చేరడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చాలాచోట్ల చెరువులు, కుంటలు అలుగుపోస్తున్నాయి. తిరుమలాయపాలెం మండలంలోని రాకాసి తండాను ఆకేరు వరద ప్రవాహం చుట్టుముట్టింది. వరద ప్రవాహం పెరుగుతుండడంతో గ్రామస్తులు డాబాల పైకి ఎక్కి తమను కాపాడాలంటూ వేడుకుంటున్నారు.


మధిర నియోజకవర్గం, ఎర్రుపాలెం మండలం, భీమవరం గ్రామపంచాయతీ భవానిపురంలో ఓ యువకుడు వాగులో కొట్టుకుపోయి మృతి చెందాడు. యువకుడి వయసు 18 ఏళ్లు. భవానిపురం గ్రామానికి చెందిన రాఘవరావు కుమారుడు, సాంబశివరావు వాగు ఉధృతికి కొట్టుకుపోయి చనిపోవడంతో రెండు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కొట్టుకుపోయిన యువకుడు వాగుకు సమీపంలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.


పాలేరు రిజర్వాయర్‌కు వరద నీరు భారీగా చేరింది. రిజర్వాయర్ నీటిమట్టం ప్రమాదకర స్థాయిలో ఉంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పాలేరు రిజర్వాయర్ కట్ట కోతకు గురవుతుంది. దీంతో అధికారులు ఖమ్మం- సూర్యాపేట ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిపివేశారు.


కాగా తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉందని, పలు గ్రామాలు, జాతీయ రహదారులు నీటితో మునిగిపోయాయని, ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ మెగాస్టార్ చిరంజీవి తన ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘‘మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే... అత్యవసరం అయితే తప్ప ఎవరు ఇంటి నుంచి బయటకు రావద్దు.. వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉండటం వల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి.. ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు, బాధితులకు మా అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వస్తున్నారు... ఇప్పుడూ అభిమానులంతా అండగా ఉంటారని ఆశిస్తున్నాను’’ అంటూ చిరంజీవి ఎక్స్‌లో పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చంద్రబాబు పథకాలు దేశానికే ఆదర్శం

ఇంతకంటే నీతిమాలిన చర్య ఉంటుందా ..

వరంగల్ జిల్లాలో వర్షాలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 01 , 2024 | 10:12 AM