TS News: ఖమ్మంలో ఘనంగా కామ దహన వేడుకలు
ABN , Publish Date - Mar 25 , 2024 | 06:57 AM
Telangana: నగర ప్రజలు కామ దహన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగకు ముందు రోజు కాముడిని దహనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని ఎన్నేస్టి రోడ్‌లో కాముని దహనాన్ని నిర్వహించారు. మేతర్(వాల్మీకి) కులస్థులు ఈ దహన వేడుకలను జరిపారు. తమ ఆచారాలలో భాగంగా వాల్మీకి కులస్థులు ఈ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
ఖమ్మం, మార్చి 25: నగర ప్రజలు కామ దహన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగకు (Holi Festival) ముందు రోజు కాముడిని దహనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని ఎన్నేస్టి రోడ్‌లో కాముని దహనాన్ని నిర్వహించారు. మేతర్(వాల్మీకి) కులస్థులు ఈ దహన వేడుకలను జరిపారు. తమ ఆచారాలలో భాగంగా వాల్మీకి కులస్థులు ఈ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
BJP Poll List: 5వ జాబితా ప్రకటించిన బీజేపీ.. కంగనా రనౌత్ ఎక్కడి నుంచంటే?
ముందుగా కాముడికి ప్రత్యేక పూజలు చేసి కామ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మేతర్(వాల్మీకి) కులస్థులు శుభం, అంకిత్, విశాల్‌లు పాల్గొన్నారు. కాముడి దహనం తర్వాతి రోజు (సోమవారం) ప్రజలు హోలీ పండుగను నిర్వహించుకోనున్నారు. ఊరూవాడ చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా హోలీ సంబరాలు జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగను ఘనంగా జరుపుకోనున్నారు.
ఇవి కూడా చదవండి..
Janasena List: ఒకేసారి 18 మంది.. అభ్యర్థుల జాబితా ప్రకటించిన జనసేన
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...